ప్రజా పాలనా సదస్సులను పకడ్బందీగా నిర్వహించాలి  - జాయింట్ కలెక్టర్ తిరుపతిరావు

ప్రజా పాలనా సదస్సులను పకడ్బందీగా నిర్వహించాలి  - జాయింట్ కలెక్టర్ తిరుపతిరావు

ముద్ర.వీపనగండ్ల:-రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ప్రజాపాలన కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని, ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని వనపర్తి జిల్లా జాయింట్ కలెక్టర్ తిరుపతిరావు అన్నారు. మంగళవారం వీపనగండ్ల చిన్నంబావి మండలాల్లోని తూముకుంట, లక్ష్మీ పల్లి గ్రామంలో ప్రజా పాలన కార్యక్రమాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి ప్రజాపాలన కార్యక్రమం నిర్వహిస్తున్న తీరును పరిశీలించారు. ప్రజలకు తాగు నీరు, కుర్చీలు తదితర ఏర్పాట్లు ఉండాలని ఎంపీడీవో కథలప్ప, డిప్యూటీ తాసిల్దార్ శ్రీనివాస్ లను ఆదేశించారు.

ఈ సందర్భంగా ప్రజల నుంచి ప్రజా పాలన దరఖాస్తులను జాయింట్ కలెక్టర్ తిరుపతిరావు స్వీకరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 6 వరకు నిర్వహిస్తున్న ప్రజాపాలన కార్యక్రమంలో అర్హులైన ప్రతి ఒక్కరూ పాల్గొని దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. అర్హులైన లబ్దిదారులు అందరూ దరఖాస్తు చేసుకునే విధంగా గ్రామంలో రోజు టామ్ టామ్ చేయించాలని పంచాయతీ సెక్రటరీ లను ఆదేశించారు.కార్యక్రమానికి ముందుగా రాష్ట్ర ముఖ్యమంత్రి సందేశాన్ని ప్రజలకు చదివి వినిపించారు.కార్యక్రమంలో వీపనగండ్ల ఎంపీఓ శ్రీనివాస్,ఏపీఓ శేఖర్ గౌడ్, ఏటీఎం బుచ్చన్న, కానిస్టేబుల్ సురేష్,అధికారులు, అంగన్వాడి టీచర్లు, మాజీ జెడ్పిటిసి కృష్ణ ప్రసాద్ యాదవ్, చిన్నంబావి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చంద్రశేఖర్ యాదవ్, నాయకులు మౌలాలి,తదితరులు పాల్గొన్నారు.