ధర్మపురి అరవింద్‌ మీద బీజేపీ నేతల తిరుగుబాటు..కరపత్రాల కలకలం

ధర్మపురి అరవింద్‌ మీద బీజేపీ నేతల తిరుగుబాటు..కరపత్రాల కలకలం

ముద్ర,జగిత్యాల:- నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్‌ మీద బీజేపీ  నేతలు తిరుగుబాటు చేస్తున్నారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్‌కి టికెట్ ఇవ్వొద్దంటూ మెట్‌పల్లి, కోరుట్లలో కరపత్రాలు పంపిణీ చేశారు బీజేపీ అసమ్మతి నేతలు. మెట్‌పల్లి, కోరుట్లలో న్యూస్ పేపర్ లలో కరపత్రాలను పంచేశారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్‌కి టికెట్ ఇవ్వొద్దంటూ న్యూస్ పేపర్ లలో కరపత్రాలను పంచారు.

కరపత్రాలపై నలుగురు వ్యక్తుల పేర్లు ముద్రించి పంచారు. అలాగే...నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్‌కి  టికెట్ ఇవ్వొద్దంటూ పేర్కొంటూనే.. "కండ్లకు పెట్టుకున్న కూలింగ్ అద్దాలు తియ్యడు ప్రజలను చూడడు...కారు నుంచి దిగడు ప్రజలతో మాట్లాడాడు, ఇంత అహంకారి నియంత ధర్మపురి అరవింద్ నిజామాబాద్ ఎంపీ గా వద్దు" అని ఆ కరపత్రాల్లో పొందుపరిచి పంచుతున్నారు బీజేపీ నేతలు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన ధర్మపురి అరవింద్..ఇప్పుడు నిజామాబాద్‌ ఎంపీ టికెట్ ఆశిస్తున్నారు.ఇక వారం రోజుల కిందట బీజేపీ పార్టీ కార్యకర్త సతీష్ అరవింద్ కి టికెట్ ఇవ్వొద్దు అంటూ రోడ్డు పైన నిరసన వ్యక్తం చేస్తూ పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.