ప్రొఫెసర్ జయశంకర్ ఆచార్య అవార్డును అందుకున్న ఎల్లారెడ్డిపేట వాసులు

ప్రొఫెసర్ జయశంకర్ ఆచార్య అవార్డును అందుకున్న ఎల్లారెడ్డిపేట వాసులు

ముద్ర ప్రతినిధి ఎల్లారెడ్డిపేట:-ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన కార్వింగ్ కళాకారుడు  శ్యామంతుల అనిల్ కు కళా రత్న అవార్డు తెలుగు వెలుగు జాతీయ స్వచ్ఛంద సంస్థ వారు అందజేశారు.దుంపెన రమేష్ కు పర్యావరణ సేవారంగంలో  విశ్వకర్మ గాయత్రి కళ వేదిక ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ ఆచార్య అవార్డును ఆదివారం విజయవాడ తెలుగు సాంస్కృతిక బాలోత్సవ భవనంలో జాతీయ అవార్డులను తెలుగు వెలుగు సాహితీ వేదిక స్వచ్ఛంద సంస్థ డాక్టర్ బ్రహ్మశ్రీ వలబోజు మోహన్ రావు, డాక్టర్ రంగిశెట్టి రమేష్ రావు, డాక్టర్ వంగాల శాంతి కృష్ణ ఆచార్య, డాక్టర్ వెంపటి శ్రావణి ఆధ్వర్యంలో అవార్డులను పంపిణీ చేశారు. అనిల్ గత 20 ఏళ్లుగా చిత్రకళా రంగంతో పాటు కార్వింగ్ కళాకారునిగా  వివిధ రంగాలలో చూపిన ప్రతిభను గుర్తించి అవార్డుకు ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు. దుంపెన రమేష్ గత 12 ఏళ్లుగా  మొక్కల పంపిణీ చేస్తూ పర్యావరణానికి రక్షణకు కృషి చేస్తున్నందుకు జాతీయ అవార్డు కు ఎంపికైనట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఎల్లారెడ్డిపేట  గ్రామస్తులతోపాటు  బంధుమిత్రులు శుభాకాంక్షలు తెలిపారు.