కౌంటింగ్ సెంటర్ తో పాటు జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ అమలు - ఎస్పీ అఖిల్ మహాజన్

కౌంటింగ్ సెంటర్ తో పాటు జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ అమలు - ఎస్పీ అఖిల్ మహాజన్

ముద్ర ప్రతినిధి, రాజన్న సిరిసిల్ల :కౌంటింగ్ సెంటర్ వద్ద ఆదివారం ఎలక్షన్ కౌంటింగ్ సందర్భంగా  ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కేంద్ర బలగాలు, ఆర్ముడ్ రిజర్వ్ బలగాలు మరియు స్థానిక పోలీస్ బలగాలతో మూడేంచేలా భద్రత చర్యలు చేపట్టడం జరిగిందని, కౌంటింగ్ సెంటర్ ఏరియాతోపాటు  జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ అమలులో ఉంటుందని   ఎస్పీ అఖిల్ మహాజన్  అన్నారు.  సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గలకు సంబంధించి ఓట్ల లెక్కింపు తంగళ్ళపల్లి మండలం బద్దెనపల్లి గ్రామంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో  చేపట్టనున్న  సందర్బంగా  ఎస్పీ అఖిల్ మహాజన్ పోలీస్ అధికారులతో కలిసి కౌంటింగ్ సెంటర్ ను పరిశీలించారు.

ఈ సందర్భంగా ఎస్పీ అఖిల్ మహాజన్  మాట్లాడుతూ తంగళ్ళపల్లి మండలం బద్దెనపల్లి గ్రామంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఆదివారంఅసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ఉన్నందున జిల్లా వ్యాప్తంగా  ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఆదివారం ఉదయం 6 గంటల నుండి సోమవారం ఉదయం 6 గంటల వరకు  144 సెక్షన్ అమలు చేస్తున్నామని అన్నారు.కౌంటింగ్ సెంటర్ తో పాటు జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ అమలులో ఉన్నందున,నలుగురు కానీ అంతకంటే ఎక్కువమంది కానీ గుంపులు గుంపులుగా తిరగవద్దని, పార్టీ జెండాలు, పార్టీ కండువాలు, గుర్తులు, ఫ్లా కార్డ్స్ ధరించవద్దు ప్రదర్శించవద్దని,మైకులు, లౌడ్ స్పీకర్లు,ధర్నాలు, రాస్తారోకోలు, ఊరేగింపులకు,అనుమతి లేదన్నారు.ఎన్నికల కౌటింగ్ పక్రియ ప్రశాంతంగా జరిగేందుకు ప్రతి ఒక్కరు పోలీస్ వారికి సహకరించలన్నారు.అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసిన అభ్యర్థులు, కౌంటింగ్ ఏజెంట్లు, ఎన్నికల ప్రవర్తన నియమావళిని తప్పకుండా పాటించాలని,ఎలక్షన్ కమిషన్ జారి చేయబడిన  గుర్తింపు కార్డ్ లను కలిగి ఉండాలని,గుర్తింపు కార్డ్ లను కలిగి ఉన్నవారిని మాత్రమే కౌంటీగ్ కేంద్రలోకి అనుమతించాడాం జరుగుతున్నరు.ఈ కార్యక్రమం లో డిఎస్పీ ఉదయ్ రెడ్డి,స్పెషల్ బ్రాంచ్ సిఐ అనిల్ కుమార్, ఎస్ఐ వెంకటేశ్వర్లు, పృథ్విదర్ గౌడ్, పోలీస్ సిబ్బంది ఉన్నారు.