రైస్ మిల్లు ఆకస్మిక తనిఖీ

రైస్ మిల్లు ఆకస్మిక తనిఖీ
  • ధాన్యం మిల్లింగ్,బియ్యం రవాణా వేగంగా పూర్తి చేయాలి
  • జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ భవిష్ మిశ్రా ఆదేశం

ముద్ర న్యూస్,కాటారం:ధాన్యం కొనుగోలు కేంద్రాల నుంచి జిల్లాలోని రైస్ మిల్లర్లు రబీ,ఖరీఫ్ సీజన్లలో సేకరించిన వరిధాన్యం మిల్లింగ్ చేసి వేగంగా బియ్యం రవాణా చేయాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా మిళ్లర్లను ఆదేశించారు.స్టాక్ రిజిస్టర్ లు, రవాణా చేసిన బియ్యం లెక్కల వివరాలను పక్కాగా మెయింటైన్ చెయ్యాలని అన్నారు.శుక్రవారం ఆయన కాటారం మండలంలోని అంకుషాపూర్ గ్రామ శివారులో గల అన్నపూర్ణ రైస్ మిల్లును ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మిల్లు యొక్క స్టాక్ సామర్ధ్యాన్ని, రిజిస్టర్లను తనిఖీ చేశారు.మిల్లు పరిసర ప్రాంతాల్లో పిచ్చి మొక్కలు మురుగునీరు నిలవకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. వర్షాకాలంలో దోమల వల్ల వచ్చే రోగాలతో జాగ్రత్తగా ఉండాలని మిల్లులో పనిచేసే కార్మికులకు సీజనల్ వ్యాధులు ప్రబలకుండా మిల్లు యజమానులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు.ప్రతి వారం వచ్చి మిల్లులో స్టాక్ రిజిస్టర్లను తనిఖీ చేయాలని కలెక్టర్ స్థానిక తహశీల్దార్ ను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో కాటారం తాహసిల్దార్ జివాకర్ రెడ్డి, రైస్ మిల్లు యజమాని ప్రశాంత్ రావు సిబ్బంది పాల్గొన్నారు.