వికలాంగుల జీవితాల్లో వెలుగులు..

వికలాంగుల జీవితాల్లో వెలుగులు..
  • అడగకుండానే పెన్షన్ పెంపు చేసిన ప్రభుత్వం..
  • ఆసరా పింఛన్లతో ఆత్మగౌరవాన్ని పెంచిన సీఎం కేసీఆర్..
  • ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి..

ముద్ర ప్రతినిధి, జయశంకర్ భూపాలపల్లి:అడగకుండానే పెన్షన్ పెంపు చేసి, వికలాంగుల జీవితాల్లో వెలుగులు నింపిన సీఎం కేసీఆర్ రాష్ట్రంలో ఆదర్శ పాలనను కొనసాగిస్తున్నారని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. జిల్లాకేంద్రంలోని ఇల్లందు క్లబ్ హౌస్ లో బుధవారం ఏర్పాటు చేసిన పెంచిన దివ్యాంగుల పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా, రాష్ట్ర వికలాంగుల సంస్థ చైర్ పర్సన్ కేతిరెడ్డి వాసుదేవ రెడ్డిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పెరిగిన పెన్షన్ లతో దివ్యాంగుల కుటుంబాల్లో నూతనంగా వెలుగు నింపడం జరిగిందని, ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో దివ్యాంగులకు సంక్షేమ భవనం ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. నియోజకవర్గంలో దాదాపు 5319మంది దివ్యాంగులకు పెరిగిన పెన్షన్ లతో రూ.4016 చొప్పున రూ.21,361,104లు అందిస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో వికలాంగులకు ప్రత్యేక రాయితీ ప్రభుత్వం కల్పిస్తుందని, వృద్ధులకు ఆసరా పింఛన్లు, పెండ్లికూతుర్లకు కల్యాణలక్ష్మీ అందించి ఆదుకుంటున్నట్లు గుర్తు చేశారు. ఒక వైపు సంక్షేమం మరో వైపు అభివృద్ధిలో ముందుకు దూసుకుపోతూ దేశంలోనే తెలంగాణ అగ్రగామిగా నిలిచిందని అన్నారు. దివ్యాంగుల సంక్షేమం కోసం ఒకవైపు జీవనోపాధికి భరోసా కల్పిస్తూ మరో వైపు ఆసరా పెన్షన్ రూపంలో వారి జీవితానికి ఆర్దిక భరోసా అందిస్తున్న సీఎం కేసీఆర్ కు రాష్ట్ర దివ్యాంగుల సమాజం తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు తెలిపారు.

దివ్యాంగుల సంక్షేమం కోసం దేశంలో ఎక్కడా లేనివిధంగా గడిచిన తొమ్మిది ఏళ్లలో పదివేల కోట్లు ఖర్చుపెట్టిన ఘనత సీఎం కేసీఆర్ కు దక్కుతుందన్నారు. నా దృష్టికి వచ్చిన కొంతమంది వికలాంగ సోదరులకు కావాల్సిన ట్రై సైకిల్, బ్యాటరీ వాహనాలను రానున్న రోజుల్లో నావంతుగా అందించేలా కృషి చేస్తానని ఈ సందర్భంగా ఎమ్మెల్యే హామి ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బుర్ర రమేష్ గౌడ్, మున్సిపల్ చైర్మన్ సెగ్గం వెంకటరాణి సిద్ధు, జడ్పీటీసీలు పులి తిరుపతి రెడ్డి, జోరుక సదయ్య, ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.