బిఆర్ నాయకులకు గృహ లక్ష్మి  పథకం వచ్చింది... 

బిఆర్ నాయకులకు గృహ లక్ష్మి  పథకం వచ్చింది... 
  • రైతు ప్రభుత్వం కాదు రాబందుల ప్రభుత్వం,
  • బిజెపి అభ్యర్థి సంకినేని వెంకటేశ్వర్ రావు

ముద్ర, చివ్వెంల:- బిఆర్ నాయకులకు గృహ లక్ష్మి  పథకం వచ్చిందనీ సంకినేని వెంకటేశ్వరరావు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జయరాం గుడి, పాండ్య తండ, బీమ్లా తండ, మొగ్గయ్య గూడెం, చందుపట్ల, తిమ్మాపురం, మోదీన్ పురం గ్రామాలలో ప్రచారం నిర్వహించి మాట్లాడారు.

2014, 2018 ఎన్నికల్లో ఆనాడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను మీరు ఒక్కసారి గుర్తు చేసుకోవాలని,దళితుడిని తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి చేస్తానని మోసం చేసాడని తెలిపారు.దళితులకు మూడెకరాల భూమి ఇస్తా అన్నాడనీ ,రాష్ట్రంలో ఒక్క దళితుడి కి కూడా మూడేకారాల భూమి ఇవ్వలేదన్నారు.రైతులకు రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చి ఏకకాలంలో రుణమాఫీ చేయని ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపాలని ఓటర్లను కోరారు.2018 ఎన్నికల్లో సొంత స్థలాలు ఉన్నవారికి ఇంటి నిర్మాణానికి ఐదు లక్షలు ఇస్త అన్నాడనీ,ఒక్కరికి కూడా 5 లక్షలు ఇవ్వలేదన్నారు.ప్రస్తుతం ఎన్నికలకు గృహలక్ష్మి పథకం పేరుతో సీఎం కేసీఆర్ మాయమాటలు చెబుతున్నాడని,మాట ఇచ్చి మాట తెప్పిన సీఎం కేసీఆర్ ను గద్దె దింపాలంటే ఇక్కడ మంత్రి జగదీశ్ రెడ్డిని ఓడించాలన్నారు.

ఉజ్వల  గ్యాస్ పథకం ద్వారా నిరుపేదలైన మహిళలకు మీ సంకినేని ఉచితంగా గ్యాస్ కలెక్షన్ ఇవ్వడం జరిగిందని తెలిపారు.తెలంగాణ రాష్ట్రంలో కౌలు రైతులకు రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు ఇవ్వడంలేదని వందల ఎకరాల పైగా ఉన్న భూస్వాములకు బడా రైతులకు రైతుబంధు మేలు చేసిందని తెలిపారు.ఇది రైతు ప్రభుత్వం కాదు రాబందుల ప్రభుత్వం,ముఖ్యమంత్రి ప్రగతి భవనాన్ని 9 నెలలు పూర్తి చేసుకున్నాడనీ , కాని పేద ఇండ్లని 9 సంవత్సరాల గడుస్తున్న పూర్తి చేయని అసమర్ధ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం,  బిజెపికి ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను విజ్ఞప్తి చేశారు. ఈ ప్రచార కార్యక్రమాలలో కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు ధరావత్ శ్రీనివాస్ నాయక్,బీజేపీ మండల అధ్యక్షులు లక్ష్మణ్ రావు,జిల్లా నాయకులు మన్మధ రెడ్డి,మండల ప్రధాన కార్యదర్శులు జంపాల వెంకటేశ్వర్లు, బిట్టు నాగరాజు,నాయకులు రాచకొండ రామకృష్ణ, అనిల్ రావు, మంగ్తా నాయక్,లకావత్ వీరన్న, అంజయ్య, రాజశేఖర్, ధరావత్ రవి,చిట్టి బాబు, కృష్ణ, శ్రీను,బిజెపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.