తుంగతుర్తి నియోజకవర్గ అరవపల్లి మండలంలో పలు గ్రామాల్లో ఎమ్మెల్యే ప్రచారం

తుంగతుర్తి నియోజకవర్గ అరవపల్లి మండలంలో పలు గ్రామాల్లో ఎమ్మెల్యే ప్రచారం

  • ఎన్నికల్లో గులాబీ పార్టీకి ఓటు వేసి పట్టం కట్టాలి
  • కాంగ్రెస్ పార్టీ కల్లబొల్లి మాటలు నమ్మవద్దు
  • ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిషోర్ కుమార్


తుంగతుర్తి ముద్ర:-తుంగతుర్తి నియోజకవర్గం అర్వపల్లి మండలంలో తుంగతుర్తి శాసనసభ్యుడు బి ఆర్ ఎస్ పార్టీ అభ్యర్థి డాక్టర్  గాదరి కిషోర్ కుమార్ ఆదివారం బొల్లంపల్లి, సీతారాంపురం, కొత్తగూడెం, రామన్నగూడెం, వేల్పుచర్ల ,గ్రామాల్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా గ్రామాల్లో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ఎమ్మెల్యే మాట్లాడుతూ 9  సంవత్సరాల కాలంలో తుంగతుర్తి నియోజకవర్గంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ సారధ్యంలో అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని అన్నారు. తుంగతుర్తి నియోజకవర్గంలో రైతుబంధు, ఆసరా పెన్షన్లు ,కళ్యాణ లక్ష్మి, కెసిఆర్ కిట్ ,రైతు బీమా, దళిత బంధు, బీసీ బందు, గృహలక్ష్మి తదితర పథకాలు ఎలాంటి రాజకీయ ప్రమేయం లేకుండా అమలు చేస్తున్నామని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల మేనిఫెస్టోలో కెసిఆర్ బీమా ప్రతి వ్యక్తికి ధీమా అనే విధంగా కొత్త పథకాన్ని ప్రవేశపెట్టారని భూమి లేని వారికి కూడా భీమా సౌకర్యం కల్పించడం కోసం ఈ పథకాన్ని ప్రవేశపెట్టారని అన్నారు. అలాగే ఆసరా పింఛన్లు పెంపకం రైతుబంధు పెంపకం లాంటివి చేపట్టారని అన్నారు.

ఎన్నికల అనంతరం ఆసరా పెన్షన్లు పెరుగుతాయని రైతుబంధు పెరుగుతుందని అన్నారు. 400 కి గ్యాస్ సిలిండర్ మహిళల కోసం ప్రవేశపెట్టారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ చెబుతున్న కల్లబొల్లి మాటలు నమ్మవద్దని ఇటీవల కర్ణాటకలో ఎన్నికల అనంతరం వాగ్దానాలన్నీ తుంగలో తొక్కి ప్రజలను మోసం చేశారని అలాంటి కాంగ్రెస్ పార్టీని నమ్మవద్దని అని అన్నారు. చెప్పిన మాట చెప్పినట్టు అమలు చేసే ముఖ్యమంత్రి కేసీఆర్ మరో మారు ముఖ్యమంత్రి అయితే ఇచ్చిన వాగ్దానాలన్నీ అమలు అవుతాయని రాష్ట్రం సస్యశ్యామలంగా ఉంటుందని అన్నారు .నియోజకవర్గంలో కాలేశ్వరం జల్లాలతో కరువు పోయిందని మిషన్ భగీరథ తో తాగునీరు సౌకర్యం ఏర్పడిందని అన్నారు .తుంగతుర్తి నియోజకవర్గ ప్రజలు ఎన్నికల్లో తనకు అఖండ మెజార్టీ ఇవ్వాలని కోరారు ముఖ్యమంత్రిగా కేసీఆర్ మళ్ళీ గెలవాలంటే తుంగతుర్తి నియోజకవర్గంలో టిఆర్ఎస్ పార్టీ గెలుపొందాలని అన్నారు. ఈ సందర్భంగా ఎన్నికల ప్రచారంలో అరవపల్లి మండల ముఖ్య నాయకులు కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొన్నారు. గ్రామ గ్రామాన మంగళహారతులు, కోలాటాలు, డప్పు వాయిద్యాలతో ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు.