సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ సభను విజయవంతం చేయాలి

సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ సభను విజయవంతం చేయాలి
  • గౌడ సంఘం జిల్లా నాయకులు గుండగాని రాములు గౌడ్

తుంగతుర్తి ముద్ర:-తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలోజాతీయ రహదారి 365 పక్కన ఈనెల 5న సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ సభను విజయవంతం చేయాలని గౌడ సంఘం జిల్లా నాయకులు గుండగాని రాములు గౌడ్, తునికి సాయిలు గౌడ్లు లు కోరారు. మంగళవారం మండల పరిధిలోని వెంపటి, గొట్టిపర్తి, తూర్పుగూడెం, గానుగుబండ గ్రామాల్లో గౌడ కులస్తుల ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించి మాట్లాడారు. విగ్రహావిష్కరణకు మంత్రులు  శ్రీనివాస్ గౌడ్,గుంటకండ్ల జగదీష్ రెడ్డి, ఎమ్మెల్యే  డాక్టర్ గాదరి కిశోర్ కుమార్, రాష్ట్ర కల్లుగీత కార్పొరేషన్ చైర్మన్ పల్లె రవికుమార్, జడ్పీ చైర్పర్సన్ గుజ్జ దీపిక యుగంధర్ రావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, జడ్పీ వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణ గౌడ్  హాజరుకానున్నట్లు తెలిపారు. ఇట్టి కార్యక్రమానికి గౌడ కులస్తులు, బహుజనులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అబ్బగాని పద్మ సత్యనారాయణ గౌడ్, యాదగిరి గౌడ్, లచ్చమ్మ, గౌడ కులస్తులు పాల్గొన్నారు.