మల్లీ స్వింగ్ లో షేర్ మార్కెట్లు

మల్లీ స్వింగ్ లో షేర్ మార్కెట్లు
  • 10, 15 రోజుల తరువాత పెరిగిన కొనుగోలుదార్లు..
  • రెండు సూచీలూ లాభాల్లోనే

న్యూఢిల్లీ: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం సెషన్‌లో ఆరంభం నుంచే మంచి లాభాల్లో దూసుకెళ్తున్నాయి. గత 10, 15 రోజుల నుంచి ఒడిదుడుకులకు లోనవుతున్న మార్కెట్లు కాస్త సెన్సెక్స్ 550 పాయింట్లకుపైగా లాభంతో 60 వేల పైన ట్రేడయింది. నిఫ్టీ ఒకదశలో 160 వరకు లాభాల్లోకి వెళ్ళినప్పటికి చివరకు 130 పాయింట్లకుపైన లాభంతో ముగిసింది.  అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు ఉన్నప్పటికీ దేశీయ మార్కెట్లో పాజిటివ్ ట్రెండ్ నడుస్తోంది. ఈ క్రమంలో ఓ స్టాక్ ఎలాంటి అడ్డూ లేకుండా దూసుకెళ్తోంది. ఇందులో ఇన్వెస్ట్ చేస్తే మంచి లాభాలు అందుకోవచ్చనేది మార్కెట్ నిపుణుల మాట. 
 అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు ఉన్నప్పటికీ కీలక రంగాల్లో కొనుగోళ్లతో దేశీయ మార్కెట్‌లో మంచి జోష్ కనబడుతోంది. మంగళవారం ట్రెండింగ్ ఆరంభం నుంచే సూచీలు లాభాల్లో దూసుకెళ్తున్నాయి. క్రితం సెషన్‌‌లో అమెరికా స్టాక్ మార్కెట్లు మంచి లాభాలను నమోదు చేయడంతో పాజిటివ్ సంకేతాలు అందాయి. ప్రస్తుతం బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 547 పాయింట్లు లాభపడి 60 వేల 979 వద్ద ట్రేడయింది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 141 పాయింట్లు వృద్ధి చెంది 17 వేల 912 పాయింట్ల వద్ద కొనసాగింది. 

ఐటీసీ, యూపీఎల్, రిలయన్స్, హెచ్‌సీఎల్ టెక్, ఇన్ఫోసిస్ లాభాల్లో కొనసాగుతున్నాయి. మరోవైపు.. అదానీ ఎంటర్ ప్రైజెస్, ఎన్‌టీపీసీ, అపోలో హాస్పిటల్స్, పవర్ గ్రిడ్, ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ నష్టాల్లోకి జారుకున్నాయి. ఇవాళ్టి ట్రేడింగ్‌లో నిఫ్టీ ఐటీ సెక్టార్ దూసుకెళ్తోంది. ఆరంభంలోనే 1.5 శాతం పెరిగి ఇవాళ్టి టాప్ సెక్టార్‌గా నిలిచింది. ఈ క్రమంలో చాలా ఐటీ కంపెనీలు మంచి లాభాల్లోకి వచ్చాయి. కానీ, ఒక స్టాక్ మాత్రం ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. అదే ఐటీ స్టాక్ సియెంట్ లిమిటెడ్  మంగళవారం ట్రేడింగ్‌లో ఆరంభంలోనే 6 శాతం మేర లాభపడింది. ఆరంభ ధర ఇవాళ్టి ట్రేడింగ్‌లో కనిష్ఠానికి పడిపోయిందంటే ఏ విధంగా దూసుకెళ్తుందో అర్థం చేసుకోవచ్చు.

సాంకేతిక పారామీటర్లను పరిశీలించినట్లయితే 14 రోజుల ఆర్ఎస్ఐ బుల్లీష్ జోష్ కనబరుస్తోంది. 60 మార్క్‌ను తాకింది. దాంతో ఆ స్టాక్‌లో పాజిటివ్ ట్రెండ్‌ని క్రియేట్ చేసింది. రోజువారీ ఎంఏసీడీ జోష్ కనబరుస్తోంది. సియంట్ లిమిటెడ్ ఇంతకా దూసుకెళ్తూ ట్రెండింగ్‌లోకి రావడానికి ప్రధాన కారణం.. దాని అనుబంధ సంస్థ సియెంట్ డీఎల్ఎం లిమిటెడ్. ఐపీఓకు సంబంధించిన జనవరి 9 నాటి డ్రాఫ్ట్ రెడ్ హియరింగ్ ప్రాస్పెక్టస్ డీఆర్‌హెచ్‌పీని సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, బీఎస్ఈ, ఎన్ఎస్ఈల వద్ద దాఖలు చేసింది. అందుకే ఈ స్టాక్ రాడార్‌లో ఉంటుందని ఇన్వెస్టర్లు భావిస్తున్నారు.