సిఎం కేసీఆర్‌తోనే సింగరేణికి మనుగడ

సిఎం కేసీఆర్‌తోనే సింగరేణికి మనుగడ
  • కేసీఆర్‌  హ్యట్రిక్ సిఎంగా చూడాలన్నదే  సింగరేణి కార్మికుల కొరిక
  •  రామగుండం శాసనసభ్యులు కోరుకంటి చందర్

గోదావరిఖని, ముద్ర :బీ.ఆర్.ఎస్ ప్రభుత్వం  సిఎం కేసీఆర్‌ గారితోనే  సింగరేణికి మనుగడ సాధ్యమని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. గురువారం  ఆర్జీ వన్ పరిధిలో 2 ఏ ఇంక్ష్లయున్ గని వద్ద ఎమ్మెల్యే  ప్రజ అంకిత యాత్ర చెపట్టారు. గని ఆవరణలో అమ్మవారి ఆలయం కార్మికులతో కలసి ప్రత్యేక పూజలు చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కాంగ్రెస్ అవినీతి అక్రమాల మూలంగానే, తమ అనుయాయులకు నిబంధనలకు విరుద్ధంగా బొగ్గు బ్లాకులను కేటాయించడం మూలంగానే బిజెపి ప్రభుత్వం 2014లో ఎంఎండిఆర్ యాక్ట్ పెట్టిందని ఆరోపించారు.  సింగరేణి గనుల ప్రైవేటీకరణకు తెరలేపి, కార్మికులకు నష్టానికి కారణమైన కాంగ్రెస్, బిజెపి పార్టీలను చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. కెసిఆర్ పాలనలోని బిఆర్ఎస్ ప్రభుత్వం సింగరేణి కార్మికుల పక్షపాతి అని, గత ప్రభుత్వాలు పోగొట్టిన వారసత్వ ఉద్యోగ హక్కును కారుణ్య నియామకాల పేరుతో కేసీఆర్ మళ్లీ పునరుద్ధరించారని ప్రతి ఏటా లాభాల వాటా పెంచుతున్నారన్నారు. బీ.ఆర్.ఎస్ ప్రభుత్వం గెలిస్తేనే సింగరేణికి మనుగడ అని కార్మికులకు మరిన్ని హక్కులు సాధించగలమని పేర్కొన్నారు. టిఆర్ఎస్ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించి కేసీఆర్ గారిని హ్యాట్రిక్ ముఖ్యమంత్రిని చేసి గనుల పరిరక్షణకు భాగస్వామ్యం కావాలని సూచించారు.రామగుండం నియోజకవర్గం లో కారు గుర్తుకు ఓటు వేయాలనీ కోరారు.  ఈ కార్యక్రమం లో టి.బి.జి.కె.ఎస్ కెంగర్లమల్లయ్య,కనకం శ్యాంసన్, వడ్డెపల్లి శంకర్,శేషగిరి తదితరులు పాల్గొన్నారు.