ఎన్నికల నేపథ్యంలో ప్రత్యేక నిఘా

ఎన్నికల నేపథ్యంలో ప్రత్యేక నిఘా

వనపర్తిలో అంతర్ జిల్లా సరిహద్దు పోలీసు అధికారుల సమావేశం: డీఐజీ L S చౌహాన్
 ముద్ర ప్రతినిధి,  వనపర్తి: రాబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా ప్రత్యేక నిఘా కొనసాగించాలని నారాయణపేట్, మహబూబ్ నగర, నాగర్ కర్నూల్, వనపర్తి, గద్వాల్  జిల్లాల పోలీసు అధికారులతో సమావేశం నిర్వహించారు. గురువారం వనపర్తి జిల్లా కేంద్రంలో  కాన్ఫరెన్స్ హాల్లో వనపర్తి జిల్లా ఎస్పి శ్రీమతి రక్షిత కే మూర్తి ఆధ్వర్యంలో నారాయణపేట్, మహబూబ్ నగర, నాగర్ కర్నూల్, గద్వాల్ పోలీసు ఉన్నతాధికారుల  సమన్వయ సమావేశం, అంతర్ జిల్లా పోలీసు ఉన్నతాధికారుల సమావేశం నిర్వహించారు.  

ఈ సందర్భంగా మావోయిస్టుల కదలికలు, సమస్త్మక పోలింగ్ స్టేషన్  ఎన్నికల నేపథ్యంలో తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై చర్చించారు. ముఖ్యంగా ట్రబుల్ మంగర్స్ కదలికలపై నిరంతరం నిఘా ఉంచి సంబంధిత సమాచారాన్ని  పరస్పరం చేరవేర్చుకోవాలని నిర్ణయించారు. ఫలితంగా trabul మంగార్స్ కట్టడి చేయడం సులభతర మవుతుందని ఎన్నికలను సజావుగా, ప్రశాంత వాతావరణంలో  నిర్వహించవచ్చని పేర్కొన్నారు. ఈ సందర్బంగా డిఐజి, శ్రీ ఎల్ యస్ చౌహాన్, ఐపీఎస్ గారు  ఐదు జిల్లా ల పోలీసు అధికారులను ఉద్దేశించి  మాట్లాడుతూ త్వరలో తెలంగాణ  రాష్ట్రం లో జరుగబోయే  ఎన్నికల దృష్ట్యా రాష్ట్ర/జిల్లా ల సరిహద్దులో   చెక్ పోస్ట్ లు ఏర్పాటు చేయటం తో పాటు మద్యం, డబ్బు ఇతర ఇల్లీగల్ కు సంబందించి అక్రమ రవాణా జరుగకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలన్నారు.


  రాష్ట్ర, జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో ప్రవేశ మరియు నిష్క్రమణ మార్గాలలో చెక్ పోస్టులను ఏర్పాటు చేసి పకడ్బందీగా తనిఖీలు చేపట్టేలా చర్యలతో పాటు, గంజాయి మరియు ఇతర మాదకద్రవ్యాల రవాణా నియంత్రణకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి నేరస్తులపై కఠిన చర్యలు తీసుకునే విధంగా పనిచేయాలని, అలాగే ఐదు జిల్లా ల పోలీసులు పరస్పరం సమాచార వ్యవస్థను సమన్వయం చేసుకొంటూ సాఫీగా ఎన్నికలు సాగేలా చూడాలని అన్నారు. తెలంగాణ తో పాటు ఇతర రాష్ట్రా, జిల్లాల తో సరిహద్దులో వున్న సమస్యాత్మకమైన గ్రామల పై ప్రత్యేక దృష్టి సారించాలని,  NBW వారెంట్స్ ల విషయం ఐదు జిల్లాల  పోలీసులు  ఒకరి ఒకరు సహకరించుకోవాలని, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించాలని డీఐజి కోరారు. ఈ కార్యక్రమంలో వనపర్తి జిల్లా ఎస్పి రక్షిత కే మూర్తి, గద్వాల ఎస్పి సృజన, నారాయనపేట్ ఎస్పి వేంకటేశ్వర్లు , మహబూబ్ నగర్ జిల్లా ఎస్పీ కే నరసింహ , నాగర్ కర్నూల్ జిల్లా ఎస్పీ మనోహర్,  డీఎస్పీలు,  సిఐలు పాల్గొన్నారు.