నూటికి నూరు శాతం మ్యానిఫెస్టో అమలు చేసిన ఏకైక పార్టీ దేశంలో బీఆర్ఎస్ మాత్రమే

నూటికి నూరు శాతం మ్యానిఫెస్టో అమలు చేసిన ఏకైక పార్టీ దేశంలో బీఆర్ఎస్ మాత్రమే
  • ప్రపంచస్థాయి పట్టణాల సరసన సూర్యాపేట ను చేర్చడమే నా స్వప్నం
  • ప్రజల ఆశలు ..ఆశయాల మేరకు పని చేశా
  • పేట అభివృద్ధి కోసం ఎన్నో నిద్ర లేని రాత్రులు గడిపా
  • జరుగుతున్న అభివృద్ధి కొనసాగాలంటే బీఆర్ఎస్ రావాలి
  • కాంగ్రెస్‌కు ఓటేస్తే చీకట్లే
  • వారిపాలన లొ పైరవీకారులదే రాజ్యం
  • నాకు వ్యతిరేకంగా ఏకమవుతున్న శత్రువులను తరిమికొట్టే బాధ్యత ప్రజలదే
  • కేసిఆర్ నాయకత్వమే తెలంగాణా కు శ్రీరామరక్ష 

ముద్ర ప్రతినిధి సూర్యాపేట:- జరుగుతున్న అభివృద్ధి కొనసాగాలంటే తిరిగి బీఆర్ఎస్ ప్రభుత్వమే రావాలి అనీ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి, సూర్యాపేట బీఆర్ఎస్ అభ్యర్ధి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. సూర్యాపేట లో రిటైర్డ్ ఆర్టీసి ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య  అతిథిగా హాజరైన మంత్రి మాట్లాడుతూ నూటికి నూరు శాతం మ్యానిఫెస్టో అమలు చేసిన ఏకైక పార్టీ దేశంలో బీఆర్ఎస్ మాత్రమే అన్నారు.పదేళ్ల క్రితం వలసలతో అగమైన తెలంగాణలో వలసలు నిరోధించి, 30 లక్షల మంది ఇతర రాష్ట్ర కూలీలకు ఉపాధి ఇచ్చే స్థాయికి చేర్చిన ఘనత కెసిఆర్ నాయకత్వంలోని భీఆర్ఎస్ ప్రభుత్వానిధి అన్నారు. దేశంలో నేటికీ 30 నుండి 40% ప్రజలు ఒక పూట తిండికే పరిమితమై  మిగతా పూటలు పస్తులు ఉంటుంటే, మూడు పూటలా ప్రజలకు తిండి పెడుతున్న  రాష్ట్రం తెలంగాణ మాత్రమే అన్నారు .

కోటి ఎకరాల భూమి సాగిలోకి తెచ్చి, కోటి 50 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడితో దేశానికి అన్నం పెట్టే అన్నపూర్ణగా తెలంగాణ అవతరించిందన్నారు. జరిగిన పదేళ్ల కాలం లో సూర్యాపేట లో  జరిగిన అభివృద్ధి ప్రజలు గుర్తించాలని కోరిన మంత్రి,గతంలో ఎలాంటి అభివృద్ధి కి నో స్మశాన వాటిక నేడు షూటింగ్ లకు కేరాఫ్ గా నిలిచిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రజల ఆశలు ..ఆశయాల మేరకు పని చేశా అన్నారు. ప్రపంచస్థాయి పట్టణాల సరసన సూర్యాపేట ను చేర్చడమే నా స్వప్నం అని తెలిపారు.భవిష్యత్‌ తరాల కోసం పనిచేస్తానన్న మంత్రి,రానున్న ఎన్నికల గురించి మేం ఆలోచించడం లేదు..భవిష్యత్‌ తరాల అభ్యున్నతి కోసం ఆలోచిస్తున్నా అన్నారు . సూర్యాపేట కు పారిశ్రామిక హబ్ ఏర్పాటు చేసి పది వేల మంది యువత కు ఉపాధి కల్పిస్తామని తెలిపారు.కాంగ్రెస్‌కు ఓటేస్తే చీకట్లే అన్న మంత్రి,వారిపాలన లొ పైరవీకారులదే రాజ్యం అన్నారు. కాంగ్రెస్ కు అధికారం ఇస్తే రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరి అవుతుందని అన్నారు. సూర్యాపేట లో నాకంటూ శత్రువులు ఎవరూ లేరన్న మంత్రీ, ప్రజల భూములు, ఆస్తులు గుంజుకుని వారికి శత్రువులైన వారంతా నా శత్రువులే అన్నారు.వారి అక్రమాలకు అడ్డుపడినందుకే ఉమ్మడి జిల్లా లో శతృవులు అంతా ఏకమయ్యారని పేర్కొన్నారు.

నాకు వ్యతిరేకంగా ఏకమవుతున్న శత్రువులను తరిమికొట్టే బాధ్యత ప్రజలదే అన్నారు. కాంగ్రెస్ కబంధ హస్తాల నుండి రాష్ర్టాన్ని కాపాడుకునే బాధ్యత యువతదే అన్నారు.కేసిఆర్ నాయకత్వమే తెలంగాణా కు శ్రీరామరక్ష  అన్నారు.కాంగ్రెస్‌ పార్టీని నమ్మి ప్రజలు ఓటేస్తే రాష్ట్రంలో మళ్లీ కటిక చీకట్లు ఏర్పడడం ఖాయమని అన్నారు.బీఆర్‌ఎస్‌ మళ్లీ అధికారంలోకి రాగానే సౌభాగ్యలక్ష్మి పథకం అమలు చేస్తామని, అర్హులైన వారికి రూ.400లకే సిలిండర్‌, తెల్ల రేషన్‌ కార్డున్న వారికి సన్నబియ్యం పంపిణీ చేస్తామని అన్నారు. బీఆర్‌ఎస్‌తోనే సంక్షేమ పథకాల అమలు సాధ్యమన్నారు. కేసీఆర్‌ తెచ్చిన పల్లెప్రగతితో గ్రామాల రూపురేఖలు మారాయని, పట్టణాలకు దీటుగా పల్లెలు అభివృద్ధి చెందాయని అన్నారు. ఆర్టీసీ విలీన ప్రక్రియను నూటికి నూరు శాతం పూర్తి చేసి, పెన్షన్ వర్తింపజేసే విషయాన్ని కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్లి అమలు చేసేలా కృషి చేస్తానని తెలిపారు. సూర్యాపేట లో జరుగుతున్న అభివృద్ధిని ఇంకా ఇంకా ముందుకు తీసుకెళ్ల వలసిన అవసరం ఎంతైనా ఉందన్న మంత్రి కారు గుర్తుకు ఓటు వేసి మరోసారి అండగా నిలవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.