Sri Chaitanya Student commits suicide: శ్రీ చైతన్య కాలేజీలో విద్యార్థిని ఆత్మహత్య

Sri Chaitanya Student commits suicide: శ్రీ చైతన్య కాలేజీలో విద్యార్థిని ఆత్మహత్య
Student commits suicide in Sri Chaitanya College
  • యాజమాన్యమే కారణమంటూ బాధితుల ఆందోళన
  • విద్యాసంస్థ గుర్తింపు రద్దు చేయాలి
  • విద్యార్థి సంఘాల డిమాండ్

ముద్ర, తెలంగాణ బ్యూరో: మేడ్చల్ జిల్లా పీర్జాదీగూడ శ్రీచైతన్య జూనియర్ కళాశాలలో స్టూడెంట్ సూసైడ్ కలకలం రేపింది. నాగర్ కర్నూల్ జిల్లా చెంచుగూడ గ్రామానికి చెందిన ఇంటర్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ నిమ్మల రమాదేవి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కుటుంబసభ్యులకు తెలియకుండానే విద్యార్థిని మృతదేహాన్ని కాలేజీ యాజమాన్యం ఆస్పత్రికి తరలించింది. యాజమాన్యం తీరుపై విద్యార్థిని తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. యాజమాన్యం తీరుతోనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకుందని ఆరోపించారు.

కాలేజీ ఎదుట ఆందోళన చేపట్టిన విద్యార్థి సంఘాల కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకుని ఉప్పల్ ఠాణాకు తరలించారు. విద్యార్థిని మృతదేహాన్ని రాత్రి పొద్దుపోయాక పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తీసుకెళ్లారు. అరెస్ట్ అయినవారిలో ఏఐఎస్ఎఫ్  రాష్ట్ర కార్యదర్శి పుట్ట లక్ష్మణ్, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాథోడ్ సంతోష్. బీఆర్ఎస్ నాయకులు వర్కల శివ గౌడ్, సామాజిక నాయకులు పంగ ప్రణయ్ కుమార్, ఏఐఎస్ఎఫ్ మేడ్చల్ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి ఎండీ అన్వర్, బీఆర్ఎస్వీ జిల్లా నాయకులు రాకేష్, సంపత్ కుమార్, ఏఐఎస్ఎఫ్ జిల్లా నాయకులు హరీశ్, గణేశ్. ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు వెంకట్ రాములు, ఏబీవీపీనాయకులు ఉన్నారు.