భాష నైపుణ్యం రాష్ట్రస్థాయి పోటీలకు విద్యార్థులు

భాష నైపుణ్యం రాష్ట్రస్థాయి పోటీలకు విద్యార్థులు

ఆలేరు (ముద్ర న్యూస్): ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యావిద్యార్థులకు స్పెల్ విజార్డ్ ఆంగ్ల భాష నైపుణ్య రామ పోటీలను సోమవారం నాడు జిల్లా కేంద్రంలో నిర్వహించారు, ఈ కార్యక్రమంలో యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని కొలనుపాక గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు తమ ఉత్తమ ప్రతిభను కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారని పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు కే రామచంద్రయ్య చెప్పారు.

మంగళవారం నాడు పాఠశాలలో ఆయన ఉపాధ్యాయులకు కలసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆంగ్ల భాష టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్థులకు స్పెల్ విజార్డ్ డ్రామా పోటీలను నిర్వహించగా కొలనుపాక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు వి రక్షిత, ఎన్ దీపిక, ఎన్ రుచిత, డి సాహితీ, తో శ్రావణీలకు ఉమ్మడి నల్లగొండ జిల్లా స్థాయి మొదటి బహుమతుని అందుకున్నట్లు తెలిపారు.

ఫిబ్రవరి 25న హైదరాబాదులో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు ద్వారా హర్వత సాధించినట్లు వివరించారు, ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు షహీనా బేగం, స్వరూపారాణి, ఎస్ఎంసి చైర్మన్ రాజబోయిన కొండల్, అఖిలభారత పేరెంట్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు కొడారి వెంకటేష్ తో పాటు పరిసర గ్రామాల విద్యార్థుల తల్లిదండ్రులు, తదితరులు పాల్గొని బహుమతులు సాధించిన విద్యార్థులను అభినందించారు.