ప్రధానమంత్రి విశ్వకర్మయోజన పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి - జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి

ప్రధానమంత్రి విశ్వకర్మయోజన పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి -  జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి

ముద్ర ప్రతినిధి, కరీంనగర్ :చేతివృత్తులు, కులవృత్తుల వారికి ఆర్థిక భద్రత కల్పించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకాన్ని అర్హులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకంపై సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్షించారు.  ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ 18 సంప్రదాయ వృత్తులకు చెందిన కులవృత్తులు, కళాకారులు మరియు హస్తకళాకారులు విశ్వకర్మ, దోభీ , నాయిని బ్రాహ్మణ, కుమ్మరి, శిల్పులు, స్వర్ణకారులు, వడ్డెర, మేర, మేదరి, ఉప్పరి, మొచి, మొదలకు  చేతివృత్తులవారు మరియు కళాకారులకు  పరికరాల కోసం సహాకారన్ని అందించడం జరుగుతుందని తెలిపారు.  ఈ వృత్తులపై జీవిస్తున్న వారికి పియం విశ్వకర్మ యోజన పథకం ద్వారా అర్హులైన వారికి సర్టిఫికెట్, ఐడి కార్డు తో పాటు పారిశ్రామిక పనిముట్ల( ట్రైనింగ్ టూల్ కిట్) కొనుగోలు కొరకు 15వేల ఆర్థిక సహాయాన్ని అందిస్తారని తెలిపారు.  5 శాతం వడ్డీకే  3 లక్షల ఎంటర్ ప్రైజెస్ డెవలప్ మెంట్ లోన్ ను రెండు విడతలుగా అందజేయడం జరుగుతుందని తెలిపారు.  డిజిటల్ లావాదేవీలపై ప్రతినెల 100 ట్రాన్స్జెక్షన్ కు ఒక రూపాయి చొప్పున ఇన్ సెంట్ లభిస్తుందని తెలిపారు.  కామన్ సర్వీస్ సెంటర్ ద్వారా ఆధార్, రేషన్ కార్డు, పాన్ కార్డు, మొబైల్ నెంబర్, బ్యాంకు వివరాలను సమర్పించి దరఖాస్తులు చేసుకోవచ్చని, దీనికి 18 సంవత్సరాలు నిండిన యువతి యువకులు అర్హులని పేర్కొన్నారు.  ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, జియం ఇండస్ట్రీస్ నవీన్ కుమార్, కరీంనగర్ మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, ఎల్ డి ఎం ఆంజనేయులు, నెహ్రూ యువ కేంద్రం అధికారి వెంకట రాంబాబు, సి ఎస్ సి జిల్లా అధ్యక్షులు, తహసీల్దార్లు తదితరులు పాల్గోన్నారు.