పవర్ స్టార్ కు అపూర్వ స్వాగతం పలికిన కుటుంబం

ముద్ర, తెలంగాణ వార్తలు: నూటికి నూరుశాతం స్థానాలను గెల్చుకుని, న్యూఢిల్లీలో ఎన్ డీఏ సమావేశంలో పాల్గొని తిరిగి హైదరాబాద్ కు వచ్చిన జనసేనాని, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు మెగాస్టార్ చిరంజీవి కుటుంబం అత్యంత ఆత్మీయ స్వాగతం పలికింది. ఆయన కారు వారి ఇంటి ముందుకు వచ్చిన వెంటనే గులాబీ పూలరేకుల వర్షం కురిసింది. కుటుంబ సభ్యులు ఒక్కొక్కరుగా వచ్చి పవన్ కల్యాణ్ ను ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు.