చెరువుల పండుగను ఘనంగా నిర్వహించాలి

చెరువుల పండుగను ఘనంగా నిర్వహించాలి

కలెక్టర్ వరుణ్ రెడ్డి

ముద్ర ప్రతినిధి, నిర్మల్: తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈనెల 8న  గ్రామాల్లో ఉన్న చెరువులు, రిజర్వాయర్ల వద్ద ఘనంగా నిర్వహించాలనికలెక్టర్ వరుణ్ రెడ్డి అన్నారు.మంగళవారం జిల్లా ఎస్పీ ప్రవీణ్ కుమార్ తో కలసి సమావేశం నిర్వహించారు.
ఈ సందర్బంగా మాట్లాడుతూ ఇప్పటివరకు జరుగుతున్న కార్యక్రమాల గురించి రోజువారి డాక్యుమెంటరీ సిద్ధం చేయాలని సూచించారు.ఊరురా చెరువులు పండుగ కార్యక్రమంలో చెరువుల వద్ద ఉన్న దేవాలయాలకు (కట్ట మైసమ్మ)  ప్రత్యేక పూజలు నిర్వహించాలని తెలిపారు. చెరువుల వద్ద సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి భోజనం చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో పాల్గొనే ప్రజలకు సౌకర్యార్థం ఎలాంటి ఇబ్బందులు లేకుండా బారికేడ్లను  ఏర్పాటు చేసి చెరువుల వద్ద గజ ఈతగాళ్లను ఉంచాలని సూచించారు.

అనంతరం ఈనెల ఎనిమిదో తేదీన మత్స్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించబోయే ఫిష్ ఫెస్టివల్ పోస్టర్ ను ఆవిష్కరించారు.తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో 22వ తేదీ వరకు నిర్వహించబోయే ప్రతి కార్యక్రమంలో అధికారులు సమన్వయంతో పనిచేసి అన్ని కార్యక్రమాల్లో జిల్లాకు మంచి పేరు తేవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్  రాంబాబు,  డీ ఆర్వో లోకేష్ , అన్ని శాఖల జిల్లా అధికారులు,  ఎంపిడిఓలు,  సంబంధిత శాఖల సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.