గొల్ల, కురుమ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం శుభ పరిణామం

గొల్ల, కురుమ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం శుభ పరిణామం
  • ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ

ఆలేరు ముద్ర:  తెలంగాణ రాష్ట్రంలో కురుమ సామాజిక వర్గం అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం గొల్ల, కురుమ కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ గురువారం నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, తెలంగాణ రాష్ట్ర కురుమ సంఘం అధ్యక్షులు ఎగ్గే మల్లేశం లు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తో కలిసి ధన్యవాదాలు తెలిపారు, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గొల్ల, కురుమలను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడం ద్వారా గొల్ల, కురుమలు రాజకీయంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.