స్వలింగ వివాహలకు చట్టబద్ధత అంశం.. రాజ్యాంగ ధర్మాసనానికి!

స్వలింగ వివాహలకు చట్టబద్ధత అంశం.. రాజ్యాంగ ధర్మాసనానికి!

దిల్లీ: స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించాలంటూ దాఖలైన పిటిషన్‌లను సుప్రీం కోర్టు  ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనానికి సిఫార్సు చేసింది.  ఈ మేరకు దాఖలైన పిటిషన్లపై సీజేఐ జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ , జస్టిస్‌ పి.ఎస్‌.నరసింహ, జస్టిస్‌ జె.బి.పార్దీవాలాతో కూడిన ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. ఈ  కేసు ఒకవైపు రాజ్యాంగ హక్కులు , మరోవైపు ప్రత్యేక వివాహ చట్టం , ప్రత్యేక శాసన చట్టాలతో ముడిపడి ఉందని వ్యాఖ్యానించింది.

ఈ అంశాన్ని చాలా ముఖ్యమైనదిగా పేర్కొంటూ.. దీనిపై విస్తృత ధర్మాసనం తీర్పు చెప్పాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. ఈ క్రమంలోనే సంబంధిత పిటిషన్లను ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనానికి సిఫార్సు చేస్తూ.. తదుపరి విచారణను ఏప్రిల్‌ 18కి వాయిదా వేసింది.  స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించాలంటూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్‌లను కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకించిన విషయం తెలిసిందే.