ఆకట్టుకున్న అయోధ్య రామ మందిరం ముగ్గు

ఆకట్టుకున్న అయోధ్య రామ మందిరం ముగ్గు

భూదాన్ పోచంపల్లి,ముద్ర: ఈ నెల 22న అయోధ్యలో రామ మందిరం ప్రారంభమవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరు తమదైన శైలిలో  తమ భక్తి భావాన్ని చాటుకుంటూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు.

శనివారం భూదాన్ పోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని మాధవ్ నగర్ కాలనీకి చెందిన కలకుంట్ల సౌమ్య అయోధ్య రామ మందిరం రూపంలో వేసిన ముగ్గు అందరినీ ఆకట్టుకుంటుంది. రామ మందిరం పై శ్రీరామ జెండా ఎగురుతున్నట్లు వేసిన ముగ్గు వాట్సాప్ లో వైరల్ గా మారింది.