Big Breaking: BRS కారేపల్లి మీటింగ్ లో విషాదం

Big Breaking: BRS కారేపల్లి మీటింగ్ లో విషాదం

కారేపల్లి: బి. ఆర్. ఎస్. ఆత్మీయ సమ్మేళనంలో విషాదం నెలకొంది. ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం చీమలపాడులో బుధవారం వైరా నియోజకవర్గ పరిధిలోని మండల స్థాయి బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు. ఎంపీ నామ నాగేశ్వరావు స్థానిక ఎమ్మెల్యే రాములు నాయక్ ర్యాలీగా వస్తుండగా బాణాసంచా కాల్చారు.

వాటి నిప్పు రవ్వలు ఓ గుడిసెకు అంటుకున్నాయి. గుడిసె నివాసంలో సిలిండర్ పేలి ఒకరు మృతి చెందారు. ఆరుగురికి తీవ్రగాయాలు కాగా వారిని ఆస్పత్రికి తరలించారు. ఫైర్ ఇంజన్ సిబ్బంది, స్థానికులు మంటలను ఆర్పి క్షతగాత్రులకు సహాయ సహకారాలు అందజేస్తున్నారు.