భువనగిరిలో దారుణం...హాస్టల్ గదిలో ఉరి వేసుకుని ఇద్దరు విద్యార్థిను ల ఆత్మహత్య

భువనగిరిలో దారుణం...హాస్టల్ గదిలో ఉరి వేసుకుని ఇద్దరు విద్యార్థిను ల ఆత్మహత్య

ముద్ర ప్రతినిధి భువనగిరి:పట్టణంలోని యస్సీ హాస్టల్లో విద్యార్థినిలు హాస్టల్ గదిలో శనివారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడ్డారు. వివరాల ప్రకారం   హబ్సిగూడ హైదరాబాద్ కి చెందిన కే. కృష్ణ కూతురు భవ్య ( 15 ), నాగరాజు కుమార్తె జీ. వైష్ణవి ( 15 ) స్థానిక యస్సీ హాస్టల్లో ఉంటూ స్థానిక ప్రభుత్వ ఉన్నత బాలికల పాఠశాలలో 10 వ తరగతి చదువుతున్నారు. వారి హాస్టల్లో ఉంటున్న 7 వ తరగతి కి చెందిన ఇద్దరు విద్యార్ధినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించి వేధింపులకు గురిచేశారు. ఈ విషయాన్ని వ్యాయామ ఉపాధ్యాయురాలికి తెలుపగా ఆ పియిటి 10 వ తరగతి విద్యార్థిని లను మందలించి వార్డెన్ కి సమాచారం అందించగా వార్డెన్ శైలజ ఈ విషయం తెలుకుని విద్యార్థులను హాస్టల్ తీసుకువచ్చి వారితో మాట్లాడి కౌన్సిలింగ్ ఇచ్చారు.

విషయాన్ని తల్లిదండ్రులకు ఫోన్ ద్వారా సమాచారం అందచేశారు. అనంతరం ఈ విషయం బయటకి తెలువడంతో ఈ విషయం తెలువదు అని చూచించింది. సాయంత్రం ట్యూషన్ కి వెళ్లగా పదవ తరగతి విద్యార్థినిలు తరువాత వస్తామని గదికి వెళ్లారు. ట్యూషన్ కి రాకపోవడంతో ట్యూషన్ టీచర్ వారిని తీసుకురావాలని గదికి పంపించారు.  గదివద్దకు వెళ్లిన విద్యార్థులు గది డోర్ తీసే ప్రయత్నం చేయగా తెరుచుకోలేకపోవడంతో కిటికీల కెళ్ళి చూడగా ఉరివేసుకొని వుండగా విషయాన్ని ట్యూషన్ టీచర్ కి తెలుపగా వారు ఆత్మహత్యకు పాల్పడినట్లు కనిపించగా వెంటనే డోర్ తీసి వెంటనే జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించగా అప్పటికే విద్యార్ధి నిలు మరణించారని వైద్యులు నిర్ధారించారు. పాఠశాల యునిఫాంకి సంబంధించి చున్నిలతో  ఉరిపోసుకున్నారు. అనంతరం మృత దేహాలను పోస్ట్ మార్డం కోసం మార్చురీకి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ సిఐ సురేష్ కుమార్ తెలిపారు. వీరి కుటుంబాల స్వస్థలం వరంగల్ జిల్లా

హాస్పటల్ చేరుకున్న డీఈవో 

విద్యార్థులు మృతి చెందిన విషయాలు డీఈవో నారాయణరెడ్డి రాత్రి వెంటనే భువనగిరి హాస్పిటల్  కు చేరుకొని వచ్చి వివరాలు  వార్డెన్ శైలజతో తెలుసుకున్నారు. ఐద్వా జిల్లా కార్యదర్శి బట్టుపల్లి అనురాధ సిపిఎం జిల్లా నాయకులు మాయ కృష్ణ, పిసిసి కార్యదర్శి పోత్నక్ ప్రమోద్ కుమార్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వనం రాజు నాయకులు,,రాహుల్, శివ లు సాయి కృపా కళాశాలను హస్పటల్ వెళ్లి పూర్తి వివరాలు తెలుసుకున్నారు.