సదాచార్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిరుపేద వధువుకు పుస్తె, మట్టెలు అందజేత

సదాచార్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిరుపేద వధువుకు పుస్తె, మట్టెలు అందజేత

ముద్ర ప్రతినిధి సూర్యాపేట:-భావితరాలకు మన సనాతన ధర్మాన్ని తెలియపరచడం తో పాటు ఆర్ధికంగా వెనుకబడిన వారిని ఆదుకోవడమే సదాచార్ ట్రస్ట్ లక్ష్యమని ట్రస్ట్ కన్వీనర్ ఈగా దయాకర్ గుప్త అన్నారు. సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని విద్యానగర్ లో గల సదాచార్ ట్రస్ట్ సేవా మందిరంలో  ఆర్ధికంగా వెనుకబడిన సూర్యాపేట కు చెందిన త్రాసు పార్దసారది,పుష్ప లత ల పుత్రిక దివ్య  వివాహము నిమిత్తం సూర్యాపేటకు చెందిన కొత్త వెంకట రెడ్డి,జ్యోతి దంపతుల సహకారంతో  మంగళసూత్రం. ,మట్టెలు, నూతన వస్త్రములు అందజేసి మాట్లాడారు.
 శ్రీ వామనాశ్రమ మహస్వామిజి ఆశీర్వచనంతో సదాచార్ ట్రస్ట్  వ్యవస్థాపక చైర్మన్  సాయి ఈశ్వర్ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో తెలంగాణ లో దాతల సహకారం తో ఆర్ధికంగా వెనుకబడిన పెండ్లి కుమార్తెలకు ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 84 మంది వదువులకు ఇచ్చామని అందులో ఒక్క సూర్యాపేట జిల్లా లోనే 51 మంది వదువులకు మంగళసూత్రాలు, మట్టెలతో పాటు నూతన వస్త్రములతో పాటు మనసాని నాగేశ్వర రావు,శ్రీదేవి దంపతులు ఇత్తడి తాంబాలం, చెంబు అందించినట్లు తెలిపారు.  ఆర్ధికంగా వెనుకబడిన  హిందూ మతం లోని కుటుంబాలకు చెందిన వారు వివాహం చేసుకునే వధువు పెండ్లి పత్రిక ,ఆధార్ కార్డ్ , తెల్ల  రేషన్ కార్డ్ తో మా కార్యాలయంలో ముందుగా సంప్రదించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో  సదా చార్ ట్రస్ట్ సభ్యులు మిర్యాల శివకుమార్, మనసానీ నాగేశ్వర రావు, శ్రీదేవి,ఈగా విజయలక్ష్మి , మిర్యాల కవిత, ఈగ అనూష,బచ్చు పురుషోత్తం, త్రాసు రజనీ, మౌనీక తదితరులు పాల్గొన్నారు.