అయ్యప్ప దేవాలయంలో ఘనంగా విషు ఉత్సవం

అయ్యప్ప దేవాలయంలో ఘనంగా విషు ఉత్సవం

కేసముద్రం, ముద్ర: ఏకశిలా పదునెట్టంబడి కలిగి తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేకతను చాటుకుంటున్న మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండల కేంద్రంలోని శ్రీ ధర్మశాస్త అయ్యప్ప దేవాలయంలో శనివారం
కేరళ నూతన సంవత్సరo 'విషు' పండగ సందర్భంగా శబరిమలలో జరిగే పూజా కార్యక్రమాల మాదిరిగా విషు వేడుక నిర్వహించారు. ప్రధాన తాంత్రి (పూజారి) బ్రహ్మశ్రీ విష్ణు నారాయణ్ పొట్టి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. స్వామి వారి మండపంలో కృష్ణుని ప్రతిమ ఎదుట వివిధ రకాల పూలు కూరగాయలతో అలంకరణ చేసి విభిన్న తరహాలో విషు పూజ నిర్వహించారు. అభిషేకం, అలంకరణ, గణపతి హోమం,కృష్ణ పూజ, ఉషా పూజ, దేవాలయ ద్వార బంధనం అనంతరం పూజా కార్యక్రమంలో పాల్గొన్న వారికి తీర్థ ప్రసాదంతో పాటు స్వామి వారికి అభిషేకం చేసిన ఒక నాణెము ప్రసాదంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప అన్నదాన సేవా సొసైటీ కార్యదర్శి పోలేపల్లి యాకుబ్ రెడ్డి, కోశాధికారి బోగోజు నాగేశ్వర చారి, కర్ర మధుసూదన్ రెడ్డి, రుద్ర శ్రీకాంత్, రాపాక కుమారస్వామి, బండారు విజేందర్, లక్కాకుల సత్యనారాయణ పాల్గొన్నారు.