ఎయిడ్స్ వ్యాది అంటువ్యాధి కాదు... అంటించుకునే వ్యాధి 

ఎయిడ్స్ వ్యాది అంటువ్యాధి కాదు... అంటించుకునే వ్యాధి 
  • ముత్తారం మండలం వైద్యాధికా అమరేందర్ రావు


ముద్ర ముత్తారం: ఎయిడ్స్ వ్యాది అంటువ్యాధి కాదని, అంటించుకునే వ్యాధి  అని  ఎయిడ్స్ డే సందర్భంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ అమరేందర్ రావు అన్నారు. శుక్రవారం ఆయన సిబ్బందితో కలిసి హాస్పటల్ నుండి అడవి శ్రీరాంపూర్ చౌరస్తా వరకు ఎయిడ్స్ దినోత్సవం ర్యాలీ నిర్వహించినారు. ఈ ర్యాలీలో భాగంగావైద్యాధికారి  మాట్లాడుతూ అంటువ్యాధి కాదు అంటించుకునే వ్యాధి కావున అందరూ జాగ్రత్తగా ఉండాలని ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులను దూరం చేసిన మాదిరిగా ఉండకూడదని, వాళ్లను కలుపుకొని ఉండాలని,  ఎయిడ్స్ కు నివారణ ఒకటి మార్గమని ప్రతి ఒక్కరూ ఎయిడ్స్ ను అరికట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో హెచ్ఈఓ నరసింహారెడ్డి, సూపర్వైజర్ వీరేశం, హెల్త్ అసిస్టెంట్ శ్రీనివాస్, ఫార్మసిస్ట్ జగదీశ్వర్, ల్యాబ్ టెక్నీషియన్ అనిల్, స్టాఫ్ నర్స్ మంగ, కల్పన, సునీత, ఏఎన్ఎమ్ లు స్రవంతి, రమాదేవి, ఆశ వర్కర్లు పాల్గొన్నారు.