వంద కోట్లు ఢిల్లీకి పంపారు.. మంత్రి ఉత్తమ్‌పై ఏలేటి సంచలన ఆరోపణలు

వంద కోట్లు ఢిల్లీకి పంపారు.. మంత్రి ఉత్తమ్‌పై ఏలేటి సంచలన ఆరోపణలు

ముద్ర,తెలంగాణ:-రాష్ట్రంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కొత్తగా యూ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. మొన్న రూ.500 కోట్లు చేతులు మారాయని, అందులో రూ.100 కోట్లను ఉత్తమ్ కుమార్ ఢిల్లీకి పంపారని చెప్పారు. సీఎం రేసులో తాను ఉన్నానని చెప్పడానికే ఆయన డబ్బులు తరలించారన్నారు.

తోటి మిత్రులు ఇచ్చి ముందుకు వెళ్తుండటంతో భయపడి ఉత్తమ్ ఇలా చేస్తున్నారన్నది నిజం కాదా? అని ప్రశ్నించారు. దీనికి మంత్రి బాధ్యత వహిస్తారా? అధికారులు బాధ్యత వహిస్తారా? అని అడిగారు. సివిల్ సప్లయ్ కమిషనర్ చౌహానికి వ్యవసాయం గురించి తెలియదనకుంటా? అని విమర్శించారు. రైతులకు డబ్బులు ఇవ్వకుండా జాప్యం చేస్తున్న రైస్ మిల్లర్లకు సంబంధించిన డేటా ఉందా? డిఫాల్టర్ల వివరాలు ఉన్నాయా? లేవా? అని అడిగారు. ముఖ్యమంత్రి రేవంత్ దీనిపై అఖిలపక్షం మీటింగ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. తాము ఈ తప్పులను నిరూపిస్తాం. ఇది సామాన్యుల రక్తాన్ని తాగే కుంభకోణం. స్టాక్ రైస్ మిల్లర్ల వద్ద ఉంటే ప్రభుత్వం వడ్డీ ఎందుకు కట్టాలి.. ప్రభుత్వం వడ్డీ కడుతున్నది నిజం కాదా? అని మాహేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు