50 వేల కంటే ఎక్కువ నగదు తీసుకెళ్తే  సీజే..

50 వేల కంటే ఎక్కువ నగదు తీసుకెళ్తే  సీజే..
  • అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా జిల్లా సరిహద్దులో 05 చెక్ పోస్ట్ లు ఏర్పాటు..
  • 24/7 పకడ్బందీగా తనిఖీలు..
  • ఎస్పీ అఖిల్ మహాజన్..

ముద్ర, గంభీరావుపేట : అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా తనిఖీల్లో సరైన ఆధారాలు లేకుండా 50 వేల కంటే ఎక్కువ అమౌంట్ తీసుకవెళ్తే సీజ్ చేయడం జరుగుతుందిని ఎస్పీఅఖిల్ మహాజన్  అన్నారు.మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలోని పెద్దమ్మ స్టేజి వద్ద    ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ ను ఎస్పీ   అఖిల్ మహాజన్ ఆకస్మికంగా తనిఖీ చేసి, సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ  సందర్భంగా ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా జిల్లా సరిహద్దులో 05 చెక్ పోస్ట్ లు ఏర్పాటు చేసి మద్యం,డబ్బు ఇతర అక్రమ రవాణా, అసాంఘిక కార్యకలపలు జరగకుండా పకడ్బందీగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని  అన్నారు చెక్ పోస్ట్ ల వద్ద విధులు నిర్వహించే సిబ్బంది ప్రతీ వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలనీ ఆదేశించారు.. ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నందున తప్పనిసరిగా ప్రతి ఒక్కరు ఎన్నికల నిబందనలు పాటించాలని, అత్యవసర వైద్యం, కళాశాల ఫీజులు, వ్యాపారం, పెళ్లిళ్లు, ఇతర అవసరాలకు డబ్బులను తీసుకెళ్తున్న వారు సరైన పత్రాలతో డబ్బులు తీసుకెళ్లాలని సూచించారు. నగదుకు సంబంధించిన తగిన ఆధారాలు, ధ్రువపత్రాలను వెంటే ఉంచుకోవడం ఉత్తమమని అన్నారు. ఎన్నికల నియమావలిని అందరూ పాటిస్తూ వాహనాల తనిఖీలకు ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. జిల్లా సరిహద్దులైన  తంగళ్ళపల్లి మండలంలోని జిల్లెళ్ల , గంభీరావుపేట మండలం పెద్దమ్మ స్టేజి, ముస్తాబాద్ మండలం బదనకల్, వేములవాడ రూరల్  మండలం  ఫజుల్ నగర్ బోయిన్ పల్లి మండలం నర్సింగాపూర్ ల వద్ద చెక్ పోస్ట్లు ఏర్పాటు చేశామని తెలిపారు.

ఈ  కార్యక్రమంలో  ఎల్లారెడ్డిపేట్ సిఐ శశిధర్ రెడ్డి, ఎస్ఐ మహేష్ మరియు సిబ్బంది ఉన్నారు.