బీజేపీకి బిగ్ షాక్ - కాంగ్రెస్‌లో చేరిన తెలంగాణ బీజేపీ సీనియర్ నేత

బీజేపీకి బిగ్ షాక్ - కాంగ్రెస్‌లో చేరిన తెలంగాణ బీజేపీ సీనియర్ నేత

ముద్ర,తెలంగాణ:- బీజేపీకి బిగ్ షాక్ తగిలింది. హుస్నాబాద్ నియోజకవర్గానికి చెందిన కీలక నేత బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి ఆ పార్టీకి రాజీనామా చేశారు. వెంటనే కాంగ్రెస్ లో చేరారు. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో, మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్  పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు సీఎం రేవంత్ రెడ్డి.బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి మాజీ ఎమ్మెల్యే బొమ్మ వెంకన్న కుమారుడు.