బాధిత కుటుంబం ఇంట్లో దొంగలు

బాధిత కుటుంబం ఇంట్లో దొంగలు
  • తాళం వేసిన ఇళ్లే టార్గెట్
  • 42 వేల నగదు, 25 తులాల వెండి, 5 గ్రాముల కమ్మలు చోరీకి గురయ్యాయి

ముద్ర, ఎల్లారెడ్డిపేట : రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన సాన దేవయ్య గత నెలలో మృతి చెందగా  కుమారుడు సాన రాజు దంపతులు నిద్ర నిమిత్తం బంధువుల గ్రామం లింగన్నపేటకు ఆదివారం రాత్రి ఇంటికి తాళం వేసి వెళ్లారు. సోమవారం ఉదయం ఇంటికి చేరుకున్న రాజుకు ఇల్లుకు తాళం తీసి ఉండడంతో ఒక్కసారిగా దిగ్భ్రాంతికి లోనై ఇంట్లోకి వెళ్లి చూడడంతో సామాన్లు చెల్లాచెదురుగా పడి ఉండడంతో లోపలి గదిలో ఉన్న బీరువాను చూడడంతో బీరువా తాళాలు పగలగొట్టి 42 వేలు, 25 తులాల వెండి, ఐదు గ్రాముల కమ్మలు  దొంగలు తస్కరించారని బాధితుడు పేర్కొన్నారు. తండ్రి చనిపోయిన దుఃఖంలో కుటుంబ సభ్యులు ఉండగా ఇలాంటి సంఘటనకు దొంగలు పూనుకోవడం చాలా బాధాకరమని గ్రామస్తులు పలువురు చర్చించుకుంటున్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు  సిరిసిల్ల నుంచి ప్రత్యేక క్రూస్ టీం బృందం ఆధారాలు సేకరిస్తున్నారు. పోలీసులు ఎప్పటికప్పుడు రాత్రిపూట పెట్రోలింగ్ చేస్తే ఇలాంటి సమస్యలు తలెత్తకుండా ఉంటాయని కోరుచున్నారు. గ్రామం చివర భాగంలో నిఘా నేత్రాలు  ఏర్పాటుచేసి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరుచున్నారు.