పిడ్స్ తో మతిస్థిమితం లేని వ్యక్తి మృతి

పిడ్స్ తో మతిస్థిమితం లేని వ్యక్తి మృతి

ముద్ర, ఎల్లారెడ్డిపేట : రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన గోనె వేణు 53 అనే వ్యక్తి మతిస్థిమితం లేక ఆదివారం రాత్రి ఓ కాలనీలో పిడ్స్ వచ్చి మరణించినట్లు తెలిసింది.మృతుడు గత కొంతకాలంగా వృద్ధ సంరక్షణ కేంద్రంలో నివసిస్తున్నట్లు తెలిసింది. మృతునికి భార్య చంద్రకళ, కుమారుడు ప్రదీప్, కూతురు రమ్య లు సిరిసిల్లలో నివాసముంటున్నారు. మృతుని సమాచారం తెలుసుకొని  సోదరుడు రవి దహన సంస్కారాల నిమిత్తం సోమవారం కుటుంబ సభ్యులు నివసిస్తున్న  సిరిసిల్లకు తీసుకెళ్లాడు.