ఘనంగా సంబరాలు

ఘనంగా సంబరాలు

మానకొండూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ నియమించినందుకు ఇల్లంతకుంట మండల కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో  బాణసంచా కాలుస్తూ స్వీట్లు పంపిణీ చేస్తూ ఘనంగా సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ అధ్యక్షుడు రాఘవరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం అహర్నిశలు కార్యకర్తలు  పనిచేయాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీలో చేరిన మాజీ సర్పంచ్ గుండా వెంకన్న గారు వెల్జిపూర్ గ్రామస్తులు కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.