రజనీకాంత్​పై వైసీపీ విమర్శలను తప్పుబట్టిన చంద్రబాబు

రజనీకాంత్​పై వైసీపీ విమర్శలను తప్పుబట్టిన చంద్రబాబు

సూపర్​స్టార్​ రజనీకాంత్​పై వైసీపీ విమర్శలను తప్పుబట్టిన చంద్రబాబు.  సీఎం జగన్​ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్​ చేశారు. జగన్​ ప్రభుత్వంపై రజనీకాంత్​ చిన్న విమర్శ కూడా చేయలేదన్నారు. ఎన్​టీఆర్​తో తన అనుబంధాన్ని మాత్రమే రజనీకాంత్​ గుర్తు చేసుకున్నారని అన్నారు. రజనీకాంత్​పై విమర్శలు వైసీపీ స్థాయిని తెలియచేస్తున్నాయి. వైసీపీ నేతల వ్యాఖ్యలు అందరికీ బాధ కలిగిస్తున్నాయని బాబు అన్నారు. రజనీకాంత్​లాంటి లెజెండ్​పై ఇలాంటి విమర్శలా? అని ప్రశ్నించారు.