పిల్లలు క్రీడలు కళల వల్ల మానసికంగా ధృడంగా అవుతారు- జిందం కళ చక్రపాణి

పిల్లలు క్రీడలు కళల వల్ల మానసికంగా ధృడంగా అవుతారు- జిందం కళ చక్రపాణి

ముద్ర సిరిసిల్ల టౌన్:  సిరిసిల్ల పట్టణంలో సాక్షి మీడియా ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన 'ఉచిత నృత్య శిక్షణ శిబిరము' ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ చక్రపాణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిందం కళ చక్రపాణి మాట్లాడుతూ అనుక్షణం సమాజంలో జరుగుతున్న విషయాలను ప్రజలకు తెలియజేస్తూ అనేక విషయాలపై ప్రజలను చైతన్య పరుస్తూ సమ సమాజ నిర్మాణంలో కీలకపాత్ర పోషిస్తున్న సాక్షి మీడియా వారు ఈ వేసవికాలంలో విద్యార్థులకు ఉచితంగా నృత్య కళ ను అందించాలనే మంచి ఆలోచనతో ఈ ఉచిత నృత్య శిక్షణ శిబిరం ఏర్పాటు చేసి విద్యార్థినీ విద్యార్థులకు చక్కని శిక్షణను అందించడానికి తోడ్పాటు చేసినందుకు వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నామని అన్నారు.

ఎందుకంటే ఇలాంటి క్రీడలు, కళల వల్ల పిల్లలలో ఏర్పడే మానసిక ఒత్తిడి లను, శారీరక సమస్యలను నివారించడంలో పిల్లలకు లోక పరిజ్ఞానం పెంచడంలో, సమాజంలో ఇతరుల పట్ల కలిగి ఉండాల్సిన గౌరవం, ప్రేమ, అభిమానాలు, సంస్కారం వంటి లక్షణాలు పెంపొందించడంలో ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య, వైస్ చైర్మన్ మంచే శ్రీనివాస్, కౌన్సిలర్ సభ్యులు నేరెళ్ల జాగీరు శైలు శ్రీకాంత్ గౌడ్ , సాక్షి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ వి.మల్లికార్జున్, అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ నేరెళ్ల శ్రీకాంత్ గౌడ్ , సాక్షి టౌన్ రిపోర్టర్ శేఖర్, ఇంగ్లీష్ యూనియన్ ఉన్నత పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయ బృందం, నృత్య శిక్షకులు, విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.