రాత్రిపూట హరితహారం చెట్ల నరికివేత

రాత్రిపూట హరితహారం చెట్ల నరికివేత
  • రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న హరితహారం
  • సిరిసిల్ల కామారెడ్డి ప్రధాన రహదారిపై ఉన్న చెట్ల నరికివేత

 ముద్ర, ఎల్లారెడ్డిపేట: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రం కామారెడ్డి సిరిసిల్ల ప్రధాన రహదారిపై హరితహారం లో భాగంగా నాటిన చెట్లను ఆదివారం అల్మాస్పూర్ గ్రామానికి చెందిన ప్రముఖ రియాల్టర్ బాలయ్య తను నిర్మించుకున్న నాలుగు అంతస్థుల అపార్ట్మెంట్ ముందు ఉన్న చెట్లను నరికి వేస్తున్నారు. కోట్లాది రూపాయలు వెచ్చించి  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని  హరితహారాన్ని గ్రామ గ్రామాన వీధి వీధిన నాటారు.

కొందరు వ్యక్తులు తమ భవనాలకు అడ్డుగా ఉన్నాయని గుట్టు చప్పుడు కాకుండా రాత్రి వేళల్లో చెట్లను తొలగిస్తున్నారు. హరితహారం నిర్లక్ష్యం చేస్తున్నారని గత మూడు నెలల క్రితం ఎల్లారెడ్డిపేట ఈవో ప్రవీణ్ కుమార్ ను జిల్లా కలెక్టర్ సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే ఎల్లారెడ్డిపేట గ్రామపంచాయతీ సిబ్బంది హరితహారం లో భాగంగా నాటిన మొక్కలను నిత్యం నీళ్లు  రెండు పూటలా ట్రాక్టర్ ట్యాంకర్లతో పోస్తూ కాపాడుతున్న మొక్కలను ఇలా నరికి వేస్తున్నారు.