స్పీకర్ ను సన్మానించిన కాంట్రాక్టు లెక్చరర్లు - సీఎం, స్పీకర్ కు పాలాభిషేకం

స్పీకర్ ను సన్మానించిన కాంట్రాక్టు లెక్చరర్లు - సీఎం, స్పీకర్ కు పాలాభిషేకం

బాన్సువాడ, ముద్ర : కాంటాక్టు ఉద్యోగులకు సీఎం కేసీఆర్‌ ప్రభుత్వం తీపికబురు అందించడంతో కాంట్రాక్టు లెక్చరర్లు మంగళవారం బాన్సువాడ లో శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డిని కలిసి సన్మానించారు. కాంటాక్టు ఉద్యోగుల రెగ్యులరైజ్‌కు సంబంధించిన ఫైల్‌పై ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంతకం చేసినందుకు లెక్చరర్లు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు స్పీకర్ కు ఘనంగా శాలువతో సత్కరించారు. అనంతరం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సీఎం కేసీఆర్‌,స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఫోటోలకు పాలాభిషేకం నిర్వహించారు. ఈసందర్భంగా కళాశాలకు వచ్చిన ఇంటర్ నోడల్ అధికారి షేక్ సలాం ను కలిసి అభినందనలు తెలిపారు. ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు ధన్యవాదాలు తెలిపారు.

ఎంతోకాలంగా రెగ్యులరైజ్‌ కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగుల కల ఎట్టకేలకు తెలంగాణ సచివాలయం ప్రారంభోత్సవం సాకారమైందని లెక్చరర్లు ఆనందం వ్యక్తం చేశారు.  ఇదిలా ఉండగా, ప్రభుత్వం నిర్ణయంతో 2,909 జూనియర్‌ లెక్చరర్ల క్రమబద్దీకరణ, 184 మంది జూనియర్‌ లెక్చరర్లు (వొకేషనల్‌), 390 మంది పాలిటెక్నికల్‌, 270 మంది డిగ్రీ లెక్చరర్లు, సాంకేతిక విద్యాశాఖలో 131 మంది అటెండర్లు, వైద్యారోగ్యశాఖలో 837 మంది వైద్య సహాకులు, వైద్యశాఖలో 179 ల్యాబ్‌ టెక్నీషియన్‌, 158 మంది ఫార్మాసిస్టులు, 230 మంది సహాయ శిక్షణ అధికారులతో పాటు పలు విభాగాలకు సంబంధించిన పోస్టులను ప్రభుత్వం రెగ్యులరైజ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిందని సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగాధర్ పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో అధ్యాపకులు జెట్టి విజయ్ కుమార్, ఎన్.లక్ష్మణ్, బాలాజీ, శ్రీనివాస్, స్వరూప్, రుక్మిణి, గంగాధర్, సంతోష్,సంజీవ్ తదితరులు పాల్గొన్నారు.