ఇమ్రాన్​అరెస్టు? వివాదాలమయంగా రాజకీయ చరిత్ర

ఇమ్రాన్​అరెస్టు? వివాదాలమయంగా రాజకీయ చరిత్ర
న్యూఢిల్లీ: పాక్​మాజీ ప్రధాని ఇమ్రాన్​ఖాన్​ ఏ క్షణంలోనైనా అరెస్టు చేసే అవకాశం ఉంది. ‘తోషాఖానా’ (మొబైల్​ ఫోన్​ల వాడకంతో లైంగిక దాడులు పెరుగుతున్నాయని, దేశ శిక్షా విభాగానికి సంబంధించి ఆరోపణలు)పై ఖాన్​అరెస్టుకు వారెంట్​ జారీ అయింది. ఆయనను అరెస్టు చేసేందుకు పోలీసులు ఇంటివద్దకు వెళ్లగా ఆయన అక్కడ లేరు. ఇస్లామాబాద్ ఐజీ అరెస్టు విషయమై మీడియాతో మాట్లాడుతూ ఇమ్రాన్​ఖాన్​ను ఈ రోజే అదుపులోకి తీసుకుంటామని స్పష్టం చేశారు. అరెస్టు విషయం తెలిసిన వెంటనే పిటీఐ కార్యకర్తలు భారీ ఎత్తున ఇమ్రాన్​ ఇంటిబయట గుమిగూడారు. ఖాన్​ను అరెస్టు చేస్తే తీవ్ర పరిణామాలు తప్పవంటూ హెచ్చరికలు చేస్తూ నినాదాలు చేశారు. 
ఇమ్రాన్​ఖాన్​పై వివాదాలు కొత్తేం కాదు.. ఇంతకు ముందు కూడా ఓ మహిళతో అశ్లీల మాటలు ఆడియో లీక్, మొబైల్​ఫోన్​ల వల్ల లైంగిక దాడులు, మహిళల వస్ర్తధారణ, ఒసామా లాడెన్​వీరుడని, అతని మాజీ భార్య రెహమా ఖాన్​తో తగాదాలు ఇలా అనేక కేసులు ఇమ్రాన్​ఖాన్​పై ఉన్నాయి.