ప్రధాన రహదారిపై ముత్తారంలో ప్రమాదకరంగా ట్రాన్స్ ఫార్మర్..

ప్రధాన రహదారిపై ముత్తారంలో ప్రమాదకరంగా ట్రాన్స్ ఫార్మర్..
  • ప్రమాదం జరుగుతే బాధ్యులు ఎవరు? 
  • విద్యుత్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ముత్తారం గ్రామ ప్రజలు

ముద్ర ముత్తారం: మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై ముత్తారంలో ప్రమాదకరంగా విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ ను విద్యుత్ అధికారులు ఎంత నిర్ల్యంగా ఏర్పాటు చేశారో చూడండి. అధికారుల నిర్లక్ష్యంతో లక్షల డబ్బులు వృధా అవుతున్నాయని, విద్యుత్ అధికారులపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ వెనకాల సబ్ స్టేషన్ నుండి కాసర్ల గడ్డ వద్ద బస్టాండు మీదుగా ప్రధాన రహదారి పక్కనే నూతన విద్యుత్ లైన్ తో పెద్ద ప్రమాదం పొంచివున్న అధికారులు మాత్రం ప్రధాన రహదారి పక్కనే రోడ్డుకు రెండు ఫీట్ల దూరంలోనే మినీ ట్రాన్స్ఫార్మర్ ను ఏర్పాటు చేశారు.  దీంతో ఈ ప్రధాన రహదారిపై ప్రమాదం పొంచి ఉందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  ఈ ప్రధాన రహదారి పై నిత్యం ఇసుక లారీలతో పాటు ఆర్టీసీ బస్సులు, కార్లు, ద్విచక్ర వాహనాలు అధికంగా ప్రయాణిస్తాయని రహదారి పక్కనే ఉన్న ఈ ట్రాన్స్ఫర్ ప్రమాదకరంగా ఉందని వెంటనే దీన్ని తొలగించాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఏదైనా పెద్ద ప్రమాదం జరుగుతే విద్యుత్ శాఖ అధికారులు బాధ్యత వహిస్తారా...అని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. ఈ ట్రాన్స్ఫర్ ను తొలగించకుంటే ఆందోళన చేస్తామని గ్రామస్తులు తెలిపారు. 

ఆర్ అండ్ బి రోడ్డును ఆనుకునే ట్రాన్స్ఫర్ ఏర్పాటు 

ప్రధాన రహదారి ఆర్అండ్ బి రోడ్డు 33 ఫీట్లు ఒక వైపు ఉంటుందని,  ఈ విషయంపై ట్రాన్స్ కో ఏఈ ని ముద్ర ఫోన్ లో సంప్రదించగా తనకు సంబంధం లేదని ఎక్కడ స్థలం ఉంటే అక్కడ పోల్స్ వేస్తామని నిర్లక్ష్యంగా జవాబిచ్చారు. పెద్దపల్లి ఆర్అండ్ బి డిఈ ని ఫోన్ లో ఇదే విషయం పై వివరణ కోరగా ప్రజల రహదారి 33 ఫీట్లు ఉంటుందని దాని అవతల విద్యుత్ లైన్ ఏర్పాటు చేయాలని అన్నారు. ఆర్ అండ్ బి రోడ్డు మొత్తం 66 ఫీట్లు ఉంటుందని డీఈ తెలిపారు. ప్రధాన రహదారిపై విద్యుత్ ఫోల్స్ వేయడంతో ప్రమాదం జరిగే అవకాశం ఎక్కువగా ఉందని ఈ పోల్స్ ను వెంటనే తొలగించి విద్యుత్ శాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.