కాంగ్రెస్ పార్టీ లో చేరిన ఎక్లాస్పూర్ గ్రామ సర్పంచ్ సదానందం యాదవ్

కాంగ్రెస్ పార్టీ లో చేరిన ఎక్లాస్పూర్ గ్రామ సర్పంచ్ సదానందం యాదవ్

ముద్ర ప్రతినిధి, పెద్దపల్లి: మంథని మండలంలోని  ఎక్లాస్పూర్ గ్రామ సర్పంచ్ చేన్నవేనా సదానందం యాదవ్ బుధవారం రాత్రి మాజీ మంత్రి,  మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన సర్పంచ్ కు శ్రీధర్ బాబు పార్టీ కండువా కప్పి పార్టీలోకి  ఆహ్వానించారు. ఈ ఎన్నికల్లో శ్రీధర్ బాబు గెలుపు కోసం నిరంతరం కృషి చేస్తానని సర్పంచ్ సదానందం తెలిపారు. ఈ కార్యక్రమంలో మంథని ఎంపీపీ కొండ శంకర్, పోతారం సర్పంచ్ జాగిరి సదానందం,  కాంగ్రెస్ నాయకులు పేరవేణి లింగయ్య యాదవ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.