మంథని లో గుర్తింపు లేని వాహనాల సంచారం పై చర్యలు తీసుకోండి మంథని రిటర్నింగ్ అధికారికి ఇనుముల సతీష్ ఫిర్యాదు
ముద్ర ప్రతినిధి పెద్దపల్లి: అసెంబ్లీ ఎన్నికల వేళ మంథని నియోజకవర్గ పరిధిలో గుర్తు తెలియని కొన్ని అక్రమ వాహనాలు తిరుగుతున్నాయని వాటిని అదుపు చేసేందుకు తగు చర్యలు తీసుకోవాలని కోరుతూ రాష్ట్ర ఎన్నికల అధికారి వి.హనుమ నాయక్ కు మంథని డివిజన్ అసెంబ్లీ ఎన్నికల కన్వీనర్ ఇనుముల సతీష్ ఫిర్యాదు చేశారు.
ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఓటర్లను భయబ్రాంతులకు గురి చేయడానికి గాను కొందరు మంథని నియోజకవర్గ పరిధిలోని కొన్ని ప్రాంతాల్లో వాహనాలకు నంబర్ ప్లేట్లు లేకుండా సుప్రీంకోర్టు నిబంధనలకు విరుద్ధంగా బ్లాక్ అద్దాలతో పలు వాహనాలు తిరుగుతున్నాయని ఇనుముల సతీష్ ఆరోపించారు.
ముఖ్యంగా మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాలకు చెందిన పలు వాహనాల్లో సామాన్యుడు తిరుగుతున్నారా...లేక కిరాయి రౌడీలు తిరుగుతున్నారా...అర్థం కానీ పరిస్థితి నెలకొందన్నారు. గతంలో కూడా ఈ ప్రాంతంలో ఈ విదంగా నెంబర్ ప్లేట్ లేని వాహనాల్లో వచ్చి పలు నేరాలుకు పాల్పడ్డ ఘటనలు ఉన్నాయన్నారు..
అసెంబ్లీ ఎన్నికల సమయంలో మంథని నియోజకవర్గ పరిధిలో తిరుగుతున్న అక్రమ అడ్రస్ లేని వాహనాలపై సీరియస్ గా దృష్టి సారించి అట్టి వాహనాల పై పలు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల అధికారి తో పాటు రాష్ట్ర డిజిపి,జిల్లా కలెక్టర్, రామగుండం పోలీస్ కమిషనర్ కు కూడా ఫిర్యాదు చేసినట్లు ఇనుముల సతీష్ తెలిపారు.