భక్తి భావంతో అయ్యప్ప లకు అన్నదానం చేస్తే మహా పుణ్యం

భక్తి భావంతో అయ్యప్ప లకు అన్నదానం చేస్తే మహా పుణ్యం
  • సోదర భావం మానవతను కలిగి ఉండటమే అయ్యప్ప మాల దారణ ముఖ్య ఉద్దేశం
  • సుధా బ్యాంక్ ఎండి, సూర్యాపేట బ్రాండ్ ప్రముఖ కవి రచయిత పెద్దిరెడ్డి గణేష్  

ముద్ర ప్రతినిధి సూర్యాపేట: పరమ పవిత్రంగా భావించే కార్తీక మాసం అయ్యప్ప మాలధారణ స్వాములకు  అన్నదానం చేయడం  ఎంతో పుణ్యముగా భావిస్తున్నానని, తోటి వారితో సోదర భావంతో మెలిగి ప్రేమ దయ మానవత్వం కలిగి ఉండటం అయ్యప్ప మాల ధారణ ముఖ్య ఉద్దేశమని సుధా బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ సూర్యాపేట బ్రాండ్ అంబాసిడర్ ప్రముఖ కవి రచయిత పెద్దిరెడ్డి గణేష్ అన్నారు బుధవారం విద్యానగర్ లోని శ్రీధర్మశాస్త్ర అన్నదాన సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు దాచేపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో గత ఆరు సంవత్సరాలుగా జరుగుతున్న అన్నదాన కార్యక్రమాన్ని బుధవారం పెద్దిరెడ్డి గణేష్ ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించి మాట్లాడారు. కార్తీక మాసాన్ని పురస్కరించుకొని వివిధ దేవత మాల ధారణ స్వాములకు మకర జ్యోతి దర్శనం కు వెళ్లే వరకు ప్రతి సంవత్సరం ఏర్పాటు చేస్తున్న మాదిరిగానే సొంత ఖర్చులతో స్వచ్ఛందంగా అన్నదానానికి దాచేపల్లి శ్రీనివాస్ ముందుకు రావడం హర్షనీయం అభినందనీయమన్నారు.  పవిత్రమైన కార్తీక మాసంలో  మాల ధారణ స్వాములు  పవిత్రంగా భోజనం  వండి వడ్డించడం ప్రశంసించదగ్గ విషయం అన్నారు. మాల ధారణ స్వాములకు చేసే అన్నదానం ఎంతో సత్ఫలితాలనిస్తుందన్నారు.అయ్యప్ప మాలలు సమాజంలో భక్తి భావాన్ని పెంపొందించడంతో పాటు హిందూ సాంప్రదాయాన్ని ప్రతిబింబిస్తాయన్నారు.అయ్యప్ప స్వామి కరుణా కటాక్షంతో  ప్రజలంతా సుఖసంతోషాలతో  ఉండాలని అయ్యప్పస్వామిని వేడుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో  శ్రీధర్మశాస్త్ర అన్నదాన సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు దాచేపల్లి శ్రీనివాస్, మన్యం శ్రీశైలం నాయుడు, అవిరేష్ వెంకటరమణ గురుస్వామి, కొనతం మధు నాయుడు, జానీ, రమేష్, పవన్ అమృత్ తదితరులు ఉన్నారు.