కాంగ్రెస్‌ హయాం.. సూర్యాపేట కు శాపం

కాంగ్రెస్‌ హయాం.. సూర్యాపేట కు శాపం
  • కాంగ్రెస్ , బిజేపి లకు ఢిల్లీ పెద్దలు అధిష్టానం ఆయితే  బీఆర్‌ఎస్‌కు తెలంగాణా ప్రజలే అధిష్టానం
  • సూర్యాపేట అభివృద్ధి వెనుక జగదీష్ రెడ్డి  కటోరశ్రమ ఉంది 
  • సూర్యాపేటను మెట్రో నగరంగా తీర్చిదిద్దాలనేదే ఆయన సంకల్పం
  • అండగా ఉండి అభివృద్ధిలో భాగస్వామ్యం అవ్వండి
  • సూర్యాపేటలోని ఐదు ,ఆరవ వార్డులో సునీత జగదీష్ రెడ్డి ఇంటింటి ప్రచారం

ముద్ర ప్రతినిధి సూర్యాపేట: కాంగ్రెస్ హయామే.. సూర్యాపేటకు పెను శాపమని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి, సూర్యాపేట భిఆర్ఎస్ అభ్యర్థి గుంటకండ జగదీష్ రెడ్డి సతీమణి సునీత జగదీష్ రెడ్డి అన్నారు. సూర్యాపేటలో ఐదు, ఆరో వార్డులలో ఇంటింటికి తిరుగుతూ, ఆప్యాయంగా పలకరిస్తూ, పెద్దల యోగక్షేమాలు తెలుసుకుంటూ  నిర్వహించిన ప్రచారానికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. భీఆర్ఎస్ మ్యానిఫెస్టో ను వివరించిన సునితమ్మ మాట్లాడుతూ,2014కు ముందు సూర్యాపేట పట్టణం ఎలా ఉం డేది.. ఇప్పుడెలా ఉందో ప్రజలు గమనించాలన్నారు. రెండుసార్లు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం గెలిస్తేనే ఇంత అభివృద్ధి జరిగిందంటే మళ్లీ గెలిస్తే ఇంకెంత అభివృద్ధి జరుగుతుందో ప్రజలు ఆలోచించాలన్నారు. మంత్రి జగదీష్ రెడ్డి నాయకత్వంలో  పచ్చదనం, పరిశుభ్రతతో పట్టణం ఆదర్శంగా నిలుస్తున్నదన్నారు. సూర్యాపేట అభివృద్ధి వెనుక జగదీశ్ రెడ్డి కఠోర శ్రమ దాగి ఉందన్న సునీతమ్మ, సూర్యాపేటను మెట్రో నగరంగా తీర్చిదిద్దడమే ఆయన సంకల్పం అన్నారు.సీఎం కేసీఆర్  తోనే  అభివృద్ధి, సాధ్యం అన్నారు.కాంగ్రెస్ , బిజేపి లకు ఢిల్లీ పెద్దలు అధిష్టానం అయితే బీఆర్‌ఎస్‌కు తెలంగాణా ప్రజలే అధిష్టానం అన్నారు. మంత్రి జగదీష్ రెడ్డికి అండగా ఉండి అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మరోసారి ఆశీర్వదిస్తే మ్యానిఫెస్టోలో చెప్పినట్లుగా మహిళలకు సౌభాగ్యలక్ష్మి పథకం ద్వారా నెలకు రూ.3000 అందించనున్నట్లు తెలిపారు. రూ.400కు గ్యాస్‌ సిలిండర్‌ను అందిస్తారన్నారు. తెల్లరేషన్‌ కార్డు కలిగిన 93 లక్షల కుటుంబాలకు రూ.5 లక్షల కేసీఆర్‌ బీమా పథకాన్ని అమలుచేయనున్నట్లు తెలిపారు.  నియోజకవర్గం లో ఇళ్లు లేని నిరుపేదలకు ప్రతీ ఒక్కరికి ఇల్లు నిర్మించాలనేదే జగదీష్ రెడ్డి  ఆకాంక్ష అన్నారు.