ఊరంతా పండగ..! శివ కోటేశ్వరాలయంలో ధ్వజస్తంభ ప్రతిష్ట

ఊరంతా పండగ..! శివ కోటేశ్వరాలయంలో ధ్వజస్తంభ ప్రతిష్ట

కేసముద్రం, ముద్ర: మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం కాట్రపల్లి గ్రామంలో కాకతీయుల కాలం నాటి శ్రీ శివ కోటేశ్వరాలయంలో బుధవారం ధ్వజస్తంభ ప్రతిష్ట, బొడ్రాయి ప్రతిష్టాపన కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామస్తులంతా హాజరుకావడంతో పండగ వాతావరణం నెలకొంది. ధ్వజస్తంభం బొడ్రాయితో పాటు నవగ్రహ, విగ్నేశ్వర, నాగదేవత, సుబ్రహ్మణ్యేశ్వర, ఆంజనేయస్వామి, ముత్యాలమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట కూడా నిర్వహించారు. గ్రామానికి చెందిన అనేకమంది ఉద్యోగ ఉపాధి నిమిత్తం ఇతర ప్రాంతాల్లో స్థిరపడ్డవారు, ఆడబిడ్డలంతా స్వగ్రామానికి చేరుకోవడంతో ఊరంతా కోలాహలంగా మారింది. ప్రజల జయ జయ ద్వానాల మధ్య సరిగ్గా ఉదయం 9: 27 నిమిషాలకు ధ్వజస్తంభ, బొడ్రాయి ప్రతిష్టాపన కార్యక్రమాలు నిర్వహించారు.