సూర్యాపేట నియోజకవర్గ రిటర్నింగ్ ఆధికారి కార్యాలయాన్ని  పరిశీలించిన  ఎన్నికల వ్యయ పరిశీలకులు విజయ్ నెట్కే

సూర్యాపేట నియోజకవర్గ రిటర్నింగ్ ఆధికారి కార్యాలయాన్ని  పరిశీలించిన  ఎన్నికల వ్యయ పరిశీలకులు విజయ్ నెట్కే

ముద్ర ప్రతినిధి సూర్యాపేట: శుక్రవారం సాయంత్రం సూర్యాపేట నియోజకవర్గ పరిధిలో ఎన్నికల ఏర్పాట్లపై సూర్యపేట అసెంబ్లీ నియోజకవర్గ వ్యయ పరిశీలకులు విజయ్ నేట్కే ఐఆర్ఎస్  ఆర్వో  కార్యాలయాన్ని సందర్శించారు. నామినేషన్ ప్రక్రియకుచేసిన ఏర్పాట్లు పెట్టిన రిజిస్టర్లను పరిశీలకులు పరిశీలించారు, ఎన్నికల ఏర్పాట్లపై సూర్యాపేట ఆర్వో కె వీర బ్రహ్మచారి తో చర్చించారు .ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేస్తూ వ్యయపరిశీలకులు పలు సూచనలు చేశారు. నామినేషన్ ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు తరగకుండా చూడాలని వ్యయ పరిశీలకులు సూచించారు.

 ఈ కార్యక్రమంలో సూర్యాపేట, ఆత్మకూరు, చివ్వెంల, పెన్పహాడ్ తాసిల్దార్.. శ్యాంసుందర్ రెడ్డి, కృష్ణయ్య ,రంగారావు, మహేందర్ రెడ్డి అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.