కాంగ్రెస్ పార్టీ ఇంటింటి ప్రచారం

కాంగ్రెస్ పార్టీ ఇంటింటి ప్రచారం

చిలుకూరు ముద్ర : చిలుకూరు మండలంలోని బేతవోలు గ్రామంలో శుక్రవారం ఎన్నికల్లో భాగంగా  కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీల ఇంటింట ప్రచారాన్ని మాజీ ఎంపీపీ బొల్లి శెట్టి నాగేంద్రబాబు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ ఆరు గ్యారెంటీలను అమలు చేస్తుందని, కోదాడ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఉత్తమ్ పద్మావతిని అధిక మెజార్టీతో గెలిపించాలని, కాంగ్రెస్ పార్టీ ఆయాంలోనే పేద బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరిగిందని, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే ప్రతి ఒక్క లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిందని, బిఆర్ఎస్  ప్రభుత్వం అధికారంలోకి వచ్చినంక  రాష్ట్రంలో ఒక్క ఇల్లు కూడా పేద ప్రజలకు ఇచ్చిన దాఖలాలే లేవని, డబల్ బెడ్ రూమ్ లు అని  కట్టించి అవి కూడా కూలిపోతున్నాయని అందుకే  బి ఆర్ ఎస్  పార్టీకి ప్రజలు చరమగీతం పాడుతారని తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుందని ఆయన అన్నారు, ఈ కార్యక్రమంలో వట్టికూటి నాగయ్య, బండ్ల కోటయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు,