రీ థింక్ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలి

రీ థింక్ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలి

మెట్‌పల్లి ముద్ర : పట్టణ ప్రగతిలో భాగంగా పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాలతో రీ థింక్ (పునరాలోచన) కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాలుపంచుకోవాలని ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ మారు విష్ణు వర్ధన్ రెడ్డి అన్నారు. రీ థింక్ కార్యక్రమంలో భాగంగా శనివారం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో అవసరమైన వారికి పాత వస్తువులను అందజేశారు. ఆర్ ఆర్ ఆర్ పేరుతో ఏర్పాటు చేసిన కౌంటర్ లలో  సేకరించిన పాత దుస్తులు, బుక్స్, చెప్పులు, ఎలక్ట్రానిక్ వస్తువులను రీ యుస్ చేసేందుకు ప్రతి శనివారం పునరాలోచన కార్యక్రమంలో అవసరమైన పేదవారికి అందజేయనున్నట్లు తెలిపారు. ముజీబ్, గంగారాణి, నిజాం లు ఉన్నారు.