చల్మెడ ఆధ్వర్యంలో ఉచిత ఇంటి ఇంటి వైద్య సర్వే..

చల్మెడ ఆధ్వర్యంలో ఉచిత ఇంటి ఇంటి వైద్య సర్వే..

ముద్ర, రుద్రoగి:రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రoగి మండల కేంద్రంలో సోమవారం రోజున చల్మెడ ఆనందరావు మెడికల్ ఆసుపత్రి మరియు కళాశాల ఆధ్వర్యంలో ఇంటి ఇంటి ఉచిత వైద్య సర్వే శిబిరం ఏర్పాటు చేసారు.ఇందులో భాగంగా మండల కేంద్రంలోని ప్రతి ఇల్లు తిరుగుతూ వైద్య పరీక్షలు నిర్వహించారు.. ప్రత్యేకంగా గుండె, కిడ్నీ, పక్షవాతం, కంటి, చెవి, ముక్కు, గొంతు, దగ్గు, దమ్ము, బిపి, షుగర్, సంబంధించిన మరియు ఆపరేషన్లకు సంబంధించిన సర్వే చేశారు.. అనంతరం అవసరమైన వారికి మందులు అందజేశారు.ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది, ప్రజాప్రతినిధులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.