దత్తాత్రేయ స్వామి దేవాలయంలో ఘనంగా ఏకాదశి పూజలు

దత్తాత్రేయ స్వామి దేవాలయంలో ఘనంగా ఏకాదశి పూజలు

ముద్ర న్యూస్, కాటారం:ఆషాడ శుద్ధ ఏకాదశి పర్వదినాన దేవాలయాలు భక్తులతో కిటికీటలాడాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం ధన్వాడ గ్రామంలోని శ్రీ దత్తాత్రేయ స్వామి దేవాలయంలో శ్రీ కాశీ కేదారేశ్వర స్వామి దర్శనార్థం భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ ప్రధానార్చకులు శ్రీరాంబట్ల కృష్ణమోహన్ శర్మ ఆధ్వర్యంలో వేద పండితులు వేద మంత్ర ఉత్సరణలతో సాంప్రదాయపూర్వకంగా శ్రీ కాశీ కేదారేశ్వర స్వామికి ఏకాదశ రుద్రాభిషేకం,సహస్రనామార్చన,బిల్వార్చన,లక్ష పత్రి పూజ,హారతి నిర్వహించారు. హిందూ సాంప్రదాయంలో భాగంగా మొదటగా వచ్చే తొలి ఏకాదశి పండుగ సందర్భంగా మహిళలు,భక్తులు దేవాలయానికి భారీగా తరలివచ్చి పూజలలో పాల్గొన్నారు. పూజల అనంతరం భక్తులకు ఆలయ పూజారి కృష్ణమోహన్ శర్మ తీర్థ ప్రసాద వితరణ చేసి ఆశీర్వచనాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో వేద పండితులు గణపతి శర్మ, లవకుశ,కారెంగుల శ్రీనివాస్ గౌడ్,అల్లాడి శ్రీనివాస్ గుప్తా, చంద్రమౌళి గుప్తా,మహేష్ గుప్తా,చీటూరి మహేష్,చీకట్ల శ్రీకాంత్,రేవన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.