హెచ్​డీఎఫ్​సీ​ విలీన ప్రక్రియ జూలై 1న పూర్తి

హెచ్​డీఎఫ్​సీ​ విలీన ప్రక్రియ జూలై 1న పూర్తి

ముంబై: హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​, హెచ్​డీఎఫ్​సీ లిమిటెడ్​ల విలీన ప్రక్రియ జూలై 1నాటికి పూర్తి అవుతుందని బ్యాంకు చైర్మన్​ దీపక్​ పారేక్​ స్పష్టం చేశారు. విలీన నేపథ్యంలో ఇరుపక్షాల బోర్డులు 30వ తేదీన సమావేశం నిర్వహించనన్నాయన్నారు. ఇరుబ్యాంకుల విలీన నిర్ణయాన్ని గతేడాది ఏప్రిల్​ 4, 2022న ప్రకటించారు. అప్పటి నుంచి ఈ విలీన ప్రక్రియ కొనసాగుతోంది. హెచ్​డిఎఫ్​సీ లిమిటెడ్​లోని 41 శాతం వాటాను బ్యాంక్​ కొనుగోలు చేయనుంది. విలీనం వల్ల ఇరు సంస్థల వ్యాపారాల్లో వృద్ధి చేకూరుతుందన్నారు. అలాగే లాభాల్లో కూడా పెరుగుదల నమోదవుతుందన్నారు. విలీన ప్రక్రియ పూర్తితో గృహ, వాహన తదితర రుణాలను విస్తరిస్తామన్నారు. అతిపెద్ద రెండు బ్యాంకుల విలీనంతో బ్యాంకు మరింత పటిష్టంగా సేవలు నిర్వహిస్తామన్నారు. అంతేగాక దేశ విదేశాల్లో హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​ పవరహౌస్​గా నిలవబోతుందని దీపక్​ పారేక్​ఆశాభావం వ్యక్తం చేశారు.