కళాశ్రీ గుండేటి రాజు కళా సేవ అభినందనీయం - ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్

కళాశ్రీ గుండేటి రాజు కళా సేవ అభినందనీయం - ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ, కరీంనగర్ ఫోక్ ఆర్ట్స్ అకాడమీ సంయుక్త నిర్వహణలో జగిత్యాలకు చెందిన ప్రముఖ కళాకారుడు, కళాశ్రీ అధినేత గుండేటి రాజుకు కళా సేవా పురస్కారం అందుకున్న శుభ సందర్భంలో ఆదివారం దేవిశ్రీ గార్డెన్ లో అభినందన ఆత్మీయ వేడుక ఘనంగా జరిగాయి. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయ్యాక సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో కళాలకు కళాకారులకు, తెలంగాణ యాసా భాషకు, ఈ కళా రంగాలను బయటకు తీసి ప్రతి కళా ను పండుగగా జరిపిస్తున్న ఘనత కేసిఆర్ కే దక్కుతుందని అన్నారు. ఈ ఆత్మీయ అభినందన వేడుకలో మద్దేల సరోజన, భువనగిరి దేవయ్య, ఉజగిరి జమున, కటుకం కవిత, అలిశెట్టి రాజు, లక్కరాజు శ్రీలక్ష్మి, కల్లపెళ్లి సరళ, మళ్లారపు రాజు కందుకూరి నాగరాజు, సంకోజి వేంకట రమణ,మామిడిపెల్లి శ్రీనివాస్, పెండెం మహేందర్, బద్రి శ్రీనివాస్ వంగల భాస్కరాచారి, మద్దేల ప్రభాకర్, గుడికందుల శ్రీనివాస్, బట్టు రాజేందర్, రుద్రంగి గోపాలకృష్ణ, నంబి నర్సింహా మూర్తి, వేణు మాధవ చార్య, దూడం శ్రీశైలం,వనమాల నిరంజన్, ఓల్లాల గంగాధర్ ,కోరుకంటి రాము,గాజుల రాజేందర్, పల్లెర్ల సురేందర్, గాజుల నాగరాజులు, గుండేటి రాజును సన్మానించారు.